Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! 

    Devara Song: ఒక్క సాంగ్‌తో ‘దేవర’పై తలకిందులైన అంచనాలు.. నెట్టింట తీవ్ర సంతృప్తి! 

    May 20, 2024

    ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. తీర ప్రాంతం నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తారక్‌ బర్త్‌డే (మే 20)ను పురస్కరించుకొని నిన్ననే మూవీ టీమ్‌.. తొలి సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సాంగ్‌ను ప్రశంసిస్తుంటే ఎక్కువ మంది సోషల్‌ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

    దూసుకెళ్తున్న సాంగ్‌

    దేవర సినిమా నుంచి ఫస్ట్‌ సాంగ్‌ను ఆదివారం (మే 19) సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఫియర్‌ సాంగ్‌’ (Fear Song) పేరుతో సాంగ్‌ లిరికల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలుగులో ఈ పాట లిరిక్స్‌ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ తొలి 20 గంటల్లో 47 లక్షల వ్యూస్ (తెలుగులో) దూసుకెళ్తోంది. అటు ఇతర భాషల్లోనూ ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తోంది. 

    ‘అనిరుధ్‌ ఎలివేషన్స్‌ ఏంటి’

    దేవర ఫస్ట్‌ సాంగ్‌ చూసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చినా.. మిగతా మ్యూజిక్‌ లవర్స్‌, నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఎన్టీఆర్‌ బర్త్‌డే సాంగ్‌లో అనిరుద్‌ ఎలివేషన్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తారక్‌ కంటే ఎక్కువగా అనిరుధ్‌ కనిపించాడని మండిపడుతున్నారు. విక్రమ్‌ సినిమా టైటిల్‌ ట్రాక్‌ని తీసుకొచ్చి ‘దేవర’కు పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. పాట మెుత్తాన్ని మ్యూజిక్‌ డామినేట్‌ చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఆ మ్యూజిక్‌ మధ్యలో లిరిక్స్‌ ఏమి వినిపింలేదని మండిపతున్నారు. ‘దేవర ముంగిట నువ్వెంత’ అన్న పదం తప్ప ఇంకేమి స్పష్టంగా వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్‌ విన్న తర్వాత ‘దేవర’ ఫిల్మ్‌పై ఉన్న అంచనాలు కూడా సన్నగిల్లుతున్ననయని మరికొందరు వ్యాఖ్యానించారు. 

    ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా?

    ‘దేవర’లోని ఫియర్‌ సాంగ్‌ను విన్న కొందరు నెటిజన్లు.. ఈ పాటను గతంలో వచ్చిన సాంగ్స్‌తో కంపేర్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్‌ ‘లియో‘ చిత్రంలోని ‘బ్యాడ్‌ యాస్‌’ పాటలా ఉందంటూ తమిళ ఆడియన్స్‌ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళంలోనూ ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన నేపథ్యంలో ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అనిరుధ్‌ మళ్లీ కాపీ కొట్టాడంటూ కామెంట్‌ బాక్స్‌లో పోస్టులు చేస్తున్నారు. 

    ‘దేవర’లో ఎన్టీఆర్‌ పాత్ర ఇదే!

    జ‌న‌తా గ్యారేజ్’ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ‘దేవ‌ర’ వస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. స‌ముద్ర తీర ప్రాంత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్‌.. దేవరలో క‌నిపించ‌నున్నాడు. ఎన్టీఆర్‌లోని హీరోయిజాన్ని దర్శకుడు కొరటాలు ఈ మూవీతో ప‌తాక స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్‌కు ధీటుగా నిలబడే విలన్ పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నాడు. అతడి పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version