ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం కావడంతో దేవర టీమ్ గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో వరుస ప్రమోషన్స్ నిర్వహించారు. తాజాగా తమిళనాడులోనూ ఓ ఈవెంట్ నిర్వహించి అక్కడ కూడా దేవరపై హైప్ తీసుకొచ్చారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్ది తారక్ కూడా తీరిక లేకుండా దేవర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ఇంటర్యూలో దేవరతో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.
‘ఫస్ట్ జాన్వీని అనుకోలేదు’
‘దేవర’ చిత్రంలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. ఈ సినిమా ద్వారానే ఆమె మెుదటిసారి తెలుగు తెరకు పరిచయమవుతోంది. అయితే ‘దేవర’ సినిమాకు హీరోయిన్‌గా మెుదట జాన్వీని అనుకోలేదని తాజా ఇంటర్యూలో తారక్ తెలిపారు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో ఎలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో కరణ్ జోహార్ కాల్ చేసి ‘జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుంది’ అని అన్నారని తారక్ తెలిపాడు. ‘ఆ తర్వాత కూడా మేము ఆమెను తీసుకోవాలని అనుకోలేదు. కానీ, జాన్వీకపూర్ ఇందులో భాగం కావాలని బలంగా కోరుకున్నారు. స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారుపడ్డారు. కానీ చక్కగా యాక్ట్ చేశారు. ఆమె యాక్టింగ్‌తో షాక్‌కు గురి చేశారు’ అని తారక్ వివరించారు.
ఆర్‌ఆర్‌ఆర్ స్ఫూర్తితో..
ఏ సినిమాకైనా టైటిల్ అనేది చాలా కీలకం. అటువంటిది పాన్ ఇండియా స్థాయిలో సినిమా వస్తుందంటే టైటిల్‌కు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అది జాతీయ స్థాయిలో అందరికీ కనెక్టింగ్‌గా అనిపించాలి. అందుకే స్టార్ హీరోల చిత్రాలకు టైటిల్ విషయంలో చాలా హోమ్ వర్క్ చేస్తుంటారు. దేవర విషయంలోనూ అదే జరిగినట్లు తారక్ తాజా ఇంటర్యూలో తెలియజేశారు. దేవర టైటిల్‌ను ఫిక్స్ చేయడం వెనకున్న కారణాన్ని కూడా తెలియజేసాడు. ఈ సినిమాకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ తరహాలో దేశవ్యాప్తంగా అందరికీ చెరువయ్యే టైటిల్ పెట్టాలని ముందే భావించినట్లు తారక్ తెలిపాడు. ఈ క్రమంలోనే ‘దేవర’ను ఫైనల్ చేసినట్లు స్పష్టం చేశారు. దేవర అంటే ‘దేవుడు’ అని అర్థమని తారక్ చెప్పుకొచ్చాడు.
రెహమాన్ స్థాయికి అనిరుధ్
దేవర చిత్రానికి అనిరుధ్ సెన్సేషన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫియర్, బుట్టమల్లె, దావూదీ సాంగ్స్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో అనిరుధ్‌పై తారక్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తోందంటూ ఆకాశానికెత్తారు. ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అనిరుధ్‌కు బాగా తెలుసని, అతను అద్భుతమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అనుకున్నవిధంగా రిజల్ట్ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ స్థాయికి అనిరుధ్ వెళ్తాడని తారక్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
తొలి ఇండియన్ ఫిల్మ్‌గా ‘దేవర’
రిలీజ్‌కు ముందే పలు రికార్డులు కొల్లగొడుతున్న ‘దేవర’ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్ (2024 Beyond Fest)లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. బియాండ్ ఫెస్ట్‌లో ఇప్పటివరకూ ఏ ఇండియన్ సినిమాను ప్రదర్శించలేదు. ఈ రికార్డు తారక్‌కే దక్కనుంది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మరోవైపు నార్త్ అమెరికాలో టికెట్ల ప్రీసేల్ రికార్డును కూడా దేవర కొల్లగొట్టింది. ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!