Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!

    Devara: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’కు ఊహించని షాక్‌.. ప్రభాస్‌, బన్నీతో పోలిస్తే వెనకబడ్డ తారక్‌!

    April 16, 2024

    ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత జూ.ఎన్టీఆర్‌ (Jr. NTR) నటిస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం, తారక్‌ డ్యూయల్‌ రోల్‌లో చేస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా దేవర ప్రీరిలీజ్ బిజినెస్‌ అంటూ కొన్ని లెక్కలు వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

    ఆ సినిమాల కంటే వెనకే!

    లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ థియేట్రికల్‌ హక్కులు రూ.130 కోట్లకు అమ్ముడుపోనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. అయితే అల్లుఅర్జున్‌ ‘పుష్ప 2’ (Pushpa 2), ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కేవలం ఒక్క రీజియన్‌లోనే రూ.100 కోట్ల మేర బిజినెస్ చేస్తోందని టాక్. వీటితో పోలిస్తే దేవర చాలా తక్కువ థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే పరిస్థితులు కనిపిస్తాయి. వాస్తవానికి టాలీవుడ్‌లో బన్నీ, తారక్‌కు సమాన క్రేజ్ ఉంది. ‘పుష్ప 2’ లాగానే ‘దేవర’ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అయినా కూడా ‘పుష్ప 2’ బిజినెస్‌ అంచనాలను తారక్ అందుకోకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుగుతుందని భావించిన వారంతా తాజా లెక్కలు చూసి పెదవి విరుస్తున్నారు. 

    ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అంచనాలు ఇవే!

    లేటెస్ట్ బజ్‌ ప్రకారం దేవర ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.400 కోట్లకు పైగా జరిగే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.130 కోట్లు పలకనున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం నిర్మాత దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు పోటీ పడుతున్నారట. మరోవైపు ఉత్తరాది, కర్ణాటక, తమిళనాడు, కేరళ కలుపుకొని సుమారు రూ.50-60 కోట్ల బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. అటు ఓవర్సీస్‌ హక్కులను రూ.27 కోట్లకు హమ్సిని ఎంటర్‌టైన్‌మెంట్‌ లాక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్‌ను రూ.33 కోట్లకు టి సిరీస్‌ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దేవర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌.. రూ.155 కోట్లకు ఖాయం చేసుకోగా మిగిలిన శాటిలైట్‌ హక్కులను కూడా కలుపుకుంటే ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు ఈజీగానే రూ.400 కోట్లు దాటతాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

    సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే?

    ‘దేవర’ మూవీ టీజర్‌, ట్రైలర్, సాంగ్‌ రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ లెక్కలు బయటకు రావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దేవర ఫస్ట్‌ పార్ట్‌కే ఈ స్థాయిలో బిజినెస్‌ జరిగితే.. రెండో భాగానికి ఇంకెంత బిజినెస్‌ జరుగుతుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, అక్టోబర్‌ 10న దసరా కానుకగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఫిల్మ్స్‌ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version