Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్‌.. కారణం ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్‌.. కారణం ఇదే!

    Drishyam 3: ట్రెండింగ్‌లో ‘దృశ్యం 3’ హ్యాష్‌ట్యాగ్‌.. కారణం ఇదే!

    December 24, 2024

    మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ (Drishyam) చిత్రం ఎంత పెద్ద హిట్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రీమేకై ఘన విజయాన్ని అందుకుంది. మెుత్తం రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతో థ్రిల్‌కు గురిచేసింది. మైండ్‌ బ్లోయింగ్‌ ట్విస్టులతో కట్టిపడేసింది. దీంతో ‘దశ్యం పార్ట్ 3’ (Drishyam 3) కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దృశ్యం మాతృకలో నటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్‌ ఈ మూవీకి సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో ‘దృశ్యం 3’ చిత్రం మరోమారు చర్చకు వచ్చింది. 

    మోహన్‌లాల్‌ ఏమన్నారంటే?

    మలయాళ నటుడు మోహన్‌లాల్‌ (Mohan Lal) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బరోజ్‌ 3D’ (Baroz 3D) విడుదలకు సిద్ధమైంది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న రిలీజ్ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తమిళనటి సుహాసిని (Suhasini) ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్‌లాల్‌ ‘దృశ్యం 3’ గురించి స్పందించారు. ఆ చిత్రం (Drishyam 3) త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు పేర్కొన్నారు. ‘దృశ్యం’ (Drishyam) సబ్జెక్ట్‌ తొలుత చాలా మంది వద్దకు వెళ్లిందని మోహన్‌లాల్‌ తెలిపారు. దర్శకుడు జీతు జోసెఫ్‌ తన వద్దకు తీసుకొచ్చినప్పుడు సబ్జెక్ట్‌ విని స్టన్‌ అయ్యాయని చెప్పారు. దానికి సీక్వెల్‌గా తీసిన ‘దృశ్యం 2’ (Drishyam 2) పాన్‌ ఇండియా స్థాయిలో విజయం సాధించిందని పేర్కొన్నారు. షూటింగ్‌ కోసం గుజరాత్‌ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి లోకల్స్ తనను గుర్తుపట్టారని మోహన్‌లాల్‌ తెలిపారు. మలయాళ ఇండస్ట్రీకి ‘దృశ్యం 2’.. పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ‘దృశ్యం 3’తో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోహన్‌లాల్‌ తెలిపారు. 2025లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

    ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు

    మలయాళ ‘దృశ్యం’లో మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా.. పార్ట్‌ 2కు జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ్‌ విషయానికొస్తే కమల్‌ హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో చేశారు. మలయాళంలో ‘దృశ్యం 3’ రూపొందితే అది మిగిలిన భాషల్లోనూ రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో మలయాళ వెర్షన్‌ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆడియన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. గత రెండు భాగాలకు మించిన ట్విస్టులు ‘పార్ట్‌ 3’లో ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. దీంతో పట్టాలెక్కకముందే ‘దృశ్యం 3’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

    పార్ట్‌ 3తో ముగింపు..!

    దర్శకుడు జీతు జోసెఫ్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని రూపొందించినప్పుడు సీక్వెల్‌ గురించి అసలు ఆలోచించలేదు. ఆ చిత్రానికి వచ్చిన భారీ రెస్పాన్స్‌ చూసి ‘పార్ట్‌ 2’ను తీశారు. స్టోరీ డెవలప్‌మెంట్‌ కోసం చాలా సమయమే తీసుకున్నారు. ఇక ‘పార్ట్‌ 3’తో దృశ్యం సిరీస్‌కు ముగింపు పలకాలని దర్శకుడు జీతు జోసెఫ్‌, మోహన్‌లాల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో పార్ట్‌కు వెళ్తే మరి సాగదీతలాగా అనిపిస్తుందని వారు భావించారట. సాలిడ్‌ స్క్రిప్ట్‌తో ‘దృశ్యం 3’ని తెరకెక్కించి మంచి క్లైమాక్స్‌తో ఈ సిరీస్‌కు స్వస్థి పలకాలని వారిద్దరు ఫిక్సయినట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు హిందీలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరెకెక్కించే యోచనలో దర్శకుడు జీతు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చివరి దశకు చేరుకుందని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. 

    దృశ్యం 3 స్టోరీ ఇదే?

    దృశ్యం పార్ట్‌ 3 (Drishyam 3) స్టోరీ ఇదేనంటూ ఓ ప్లాట్‌ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం తొలి రెండు పార్ట్స్‌లో లాగానే మూడో భాగంలోనూ హీరోతో హత్యకు సంబంధించిన నిజం చెప్పించేందుకు పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తారట. అయితే వారికి ఏ మాత్రం దొరక్కుండా హీరో మరోమారు ఎత్తుకు పైఎత్తులు వేస్తారని తెలుస్తోంది. గత రెండు పార్ట్స్‌కు మించిన ట్విస్టులు మూడో భాగంలో ఉంటాయని సమాచారం. అలాగే పోలీసుల బెడద తప్పించుకునేందుకు హీరో ఓ జాతీయ పార్టీలో కూడా చేరతారట. అలా ఒక పార్టీ నేతగా ఎదిగిన హీరోను పోలీసులు ఏమి చేయలేకపోతారట. చివరికీ కేసును కూడా క్లోజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version