డ్రోన్ పైలట్ అవుతారా? ఇది తెలుసుకోండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్రోన్ పైలట్ అవుతారా? ఇది తెలుసుకోండి

    డ్రోన్ పైలట్ అవుతారా? ఇది తెలుసుకోండి

    July 20, 2022

    డ్రోన్ల రంగం రోజురోజుకూ దూసుకుపోతోంది. ఫోటోలు తీయడం దగ్గర్నుంచి ఆర్మీలో ఆపరేషన్ల వరకూ డ్రోన్ల వినియోగం విస్తరించింది. దీంతో ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. డ్రోన్ పైలట్లుగా ఎదిగేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతున్నారు. వారికి శిక్షణ అందించేందుకు అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అసలు డ్రోన్ ఫ్లయింగ్ అంటే ఏమిటి? మన దేశంలో డ్రోన్ల వినియోగ నిబంధనలేంటి? హైదరాబాద్ లో డ్రోన్ ఫ్లయింగ్ శిక్షణ సంస్థల వివరాలేంటి ఇవన్నీ ఈ ఆర్టికల్ లో చూద్దాం.

    డ్రోన్ ఫ్లయింగ్ అంటే ఏంటి?

    డ్రోన్లంటే మనుషులు లేకుండా రిమోట్ తో కంట్రోల్ చేసే విమానాలే(అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్-యూఏఎస్). వీటిని ఫోటోగ్రఫీ, వ్యవసాయం, డెలివరీ, రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ ఫ్లయింగ్ వైమానిక రంగంలో భాగమయ్యేందుకు ఒక చక్కటి అవకాశం. అలాగే కెరీర్ గా ఎంచుకుని డబ్బు సంపాదించేందుకూ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. డ్రోన్ పైలట్ గా ఎదగాలనుకుంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.  

    ప్రభుత్వం డ్రోన్లను ఐదు కేటగిరీలుగా విభజించింది:

    • అతిసూక్ష్మ( నానో ) డ్రోన్లు: 250 గ్రాములు లేదా అంతకన్నా తక్కువ బరువుండేవి. వీటికి అనుమతులు అక్కర్లేదు.
    • సూక్ష్మ( మైక్రో ) డ్రోన్లు : 250 గ్రాముల నుంచి 2కిలోల వరకూ ఉండేవి. వీటిని వ్యాపారేతరంగా వినియోగించుకునేందుకు అనుమతులు అవసరం లేదు.
    • చిన్నస్థాయి( స్మాల్) డ్రోన్లు: 2కిలోల నుంచి 25 కిలోల వరకు ఉండేవి. 
    • మధ్య స్థాయి( మీడియం ): 25కిలోల నుంచి 150 కిలోల వరకు ఉండేవి.
    • భారీ స్థాయి( లార్జ్ ): 150 కిలోలు దాటి బరువుండేవి. 

    మొదట మీరు డ్రోన్ ఫ్లయింగ్ నిబంధనలు తెలుసుకోవాలి. DGCA (https://digitalsky.dgca.gov.in/) నిబంధనలు ప్రతి డ్రోన్ పైలట్ తప్పక పాటించాలి. ఇందులో డ్రోన్ కు లైసెన్స్ పొందడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటివి కూడా ఉంటాయి. ఇదంతా  https://digitalsky.dgca.gov.in/) వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. తర్వాత మీ శిక్షణ కోసం సరైన ఇన్ స్టిట్యూట్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ సమయం, డబ్బు వెచ్చించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మీకు ఉత్తమమైన కొన్ని శిక్షణా సంస్థల వివరాలు ఇస్తున్నాం. 

    హైదరాబాద్ లోని డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థలు

    తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (TSAA) 

    తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా డ్రోన్ శిక్షణ అందిస్తోంది. ప్రతివారం ఒక బ్యాచ్ చొప్పున 5రోజుల కోర్సును బేగంపేటలోని ఏవియేషన్ అకాడమీలో నిర్వహిస్తోంది. ప్రతి బ్యాచ్ లో ఆరుగురు విద్యార్థులు ఉంటారు. మొత్తం ఆరు రకాల కోర్సులు అందిస్తున్నారు.  కోర్సు పూర్తయ్యాక డీసీజీఏ నుంచి డ్రోన్ పైలట్ గా సర్టిఫికేట్ పొందాలంటే తప్పక టెస్టు పాస్ కావాల్సిఉంటుంది. 

    సంస్థ రకం : ప్రభుత్వ రంగం

    DGCA సైట్ లో లిస్ట్ చేయబడిందా: అవును

    అర్హతలు: కనీసం 10వ తరగతి పాసై, ఇంగ్లీషు నైపుణ్యం ఉండాలి.

    కోర్సు వ్యవధి : 5 రోజులు

    రిజిస్ట్రేషన్ : TSAA అధికారిక వెబ్ సైట్ ద్వారా

    ఫీజు : 56,000 + 18% జీఎస్టీ

    ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ

    సంస్థ రకం : ప్రైవేటు

    DGCA వెబ్ సైట్ లో లిస్ట్ చేయబడిందా: అవును

    అర్హత :కనీసం 10వ తరగతి పాసై, ఇంగ్లీషు నైపుణ్యం ఉండాలి.

    కోర్సులు: 

    • ఏరియల్ సర్వీలియన్స్, మానిటరింగ్ మరియు లా ఎన్ ఫోర్స్ మెంట్
    • జియోగ్రాఫికల్ మ్యాపింగ్ మరియు సర్వేలు
    • వ్యవసాయం, మత్స్యరంగం, అటవీశాఖ
    • సెర్చ్ అండ్ రెస్క్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ( విపత్తు నిర్వహణ )
    • ఏరియల్ సినిమాటోగ్రఫీ, వీడియోగ్రఫీ జర్నలిజం అండ్ ఫోటోగ్రఫీ
    • కార్గో డెలివరీ అండ్ లాజిస్టిక్స్
    • ఎయిర్ టాక్సీ మరియు అర్బన్ ఎయిర్ మొబిలిటీ

    కోర్సు వ్యవధి : 5 days

    ఫీజు: రూ.64,900 +18% జీఎస్టీ

    ఇండియన్ ఇన్ స్టిట్యూట్ డ్రోన్ హైదరాబాద్

    (పయనీర్ ఫ్లయింగ్ అకాడమీ)

    అర్హతలు: కనీసం 10వ తరగతి పాసై, ఇంగ్లీషు నైపుణ్యం ఉండాలి.

    DGCA వెబ్ సైట్ లో లిస్ట్ చేయబడిందా: అవును

    కోర్సు వ్యవధి : 5 days

    కోర్సుల వివరాలు:

    మైక్రో కేటగిరీ మల్టీరోటార్ డ్రోన్ పైలట్ కోర్సు  – రూ..33630/- జీఎస్టీతో సహా

    స్మాల్ కేటగిరీ మల్టీరోటార్ డ్రోన్ పైలట్ కోర్సు-రూ.70,800/- జీఎస్టీతో సహా

    ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్

    సంస్థ రకం : ప్రైవేటు

    DGCA వెబ్ సైట్ లో లిస్ట్ చేయబడిందా: లేదు

    అర్హత :కనీసం 10+2 పాసై ఉండాలి.

    కోర్సు వ్యవధి:  45 days

    కోర్సు మరియు ఫీజు: సర్టిఫికెట్ ఇన్ డ్రోన్ ట్రైనింగ్ – రూ.30,000/- 

    మారుత్ డ్రోన్స్

    సంస్థ రకం : ప్రైవేటు

    DGCA వెబ్ సైట్ లో లిస్ట్ చేయబడిందా: లేదు

    అర్హత :కనీసం 10వ తరగతి తప్పక పాసై ఉండాలి.

    కోర్సు వ్యవధి:  5 రోజులు

    తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీకి అనుబంధంగా అన్ని కోర్సులు అందిస్తుంది.

    పైన తెలిపిన సంస్థల్లో చేరేముందు మీ బాధ్యతగా ఆరా తీసి చేరండి. మీరు సదరు సంస్థలో చేరడం వల్ల వచ్చే సమస్యలకు YouSay గానీ KTree గానీ ఎలాంటి బాధ్యత వహించదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version