చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా

    చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా

    December 27, 2022

    Courtesy Instagram:faria abdullah

    జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన హీరోయిన్ ‘ఫరియా అబ్దుల్లా’. చిట్టిగా నవీన్ పొలిశెట్టితో నటించి తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫరియా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది.

    2021లో విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ‘ఫరియా అబ్దుల్లా’.

    హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియాకు 24ఏళ్లే. 1998 మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు పుట్టింది.

    చిన్నప్పటి నుంచి ఫరియాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కాలేజీ రోజుల్లో వివిధ ప్రదర్శనలు చేసి తన కెరీర్‌కు బాటలు వేసుకుంది.

    హైదరాబాద్‌లోని లొయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిందీ అమ్మడు. అటు మోడ్రన్ గర్ల్‌గా కవ్విస్తూ.. సంప్రదాయ వస్త్రధారణలోనూ ఆకట్టుకుంటుంది.

    తెలంగాణలో పుట్టినప్పటికీ తెలుగులో మాట్లాడటానికి ఫరియా ఇబ్బంది పడుతుంటుంది. ఉర్దూ యాసలో మాట్లాడే తెలుగు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది.

    ‘జాతిరత్నాలు’ సినిమా హిట్ తర్వాత ఫరియా కొంచెం సమయం తీసుకుంది. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా గ్యాప్ ఇచ్చిందట.

    ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమాతో మరోసారి తెరమీద హీరోయిన్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రంలో ఓ ట్రావెల్ వ్లాగర్‌గా నటించింది.

    అఖిల్ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. బంగార్రాజు సినిమాలో ఐటెమ్ సాంగ్ చేసింది.

    రవితేజ ‘రావణాసుర’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

    సినిమాల్లోకి రాకముందే ఫరియా కెమెరా ముందుకొచ్చింది. నక్షత్ర అనే త్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌‌తో హైదరాబాద్ చిన్నది అందరి కంట పడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version