‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ

    ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’  మూవీ రివ్యూ

    September 2, 2022

    ‘అనుదీప్‌ కేవీ’ పరిచయం అక్కర్లేని ‘జాతిరత్నం’. అస్సలు లాజిక్‌ లేని కథ, ఆద్యంతం కామెడీతో ‘జాతి రత్నాలు’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన దర్శకుడు. మరి అలాంటి  అనుదీప్‌ కథ, కథనం అందించిన సినిమా ‘ఫస్ట్‌ డే ఫస్ట్ షో’. తమ వెరైటీ ప్రమోషన్లతో సినిమాపై చాలా ఆసక్తి పెంచారు. మరి అనుదీప్‌ ఈ సారి ఫాలో అయిన ఫార్ములా ఏంటి? సినిమా వర్క్‌ అవుట్‌ అయిందా? చూద్దాం

    సినిమా: ఫస్ట్‌ డే ఫస్ట్ షో

    దర్శకుడు:వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి

    నటీ నటులు: శ్రీకాంత్‌ రెడ్డి, సంచితా బసు, వెన్నెల కిశోర్‌, తనికెళ్ల భరణి తదితరులు

    మ్యూజిక్: రాధన్‌

    నిర్మాతలు: శ్రీజ, శ్రీరామ్

    కథ: 

    కథ సింపుల్. పవన్ కల్యాణ్ ఖుషీ సినిమా విడుదల కాలంలో నడుస్తుంది. హీరో శ్రీనివాస్‌ పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. అతడికో లవ్‌ స్టోరీ కూడా ఉంటుంది. ఆ పిల్ల మనోడిని పవన్ కల్యాణ్‌ ‘ఖుషి’ సినిమాకు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్లు అడుగుతుంది. ఇక ఎలాగైనా టికెట్లు సంపాదించాలని కంకణం కట్టుకుని మనోడు బయల్దేరతాడు. మరి టికెట్లు దొరికాయా? మనోడి లవ్‌ సక్సెస్‌ అయ్యిందా? టికెట్ల కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు? ఇదీ సినిమా…

    ఎట్లుంది?

    ‘జాతి రత్నాలు’కు వర్కవుట్‌ అయిన ఫార్మూలానే అనుదీప్‌ ఇక్కడ కూడా ప్రయత్నించాడు. అంటే చాలా వరకు లాజిక్‌ లేకుండా సాగే కథ అన్నమాట.మరి కామెడీ ఆ స్థాయిలో వర్కవుట్‌ అయిందా అంటే అక్కడ నవీన్‌ లాంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు. ఇక్కడ అది కాస్త మిస్‌ అయినట్లు అనిపిస్తుంది.  కాకపోతే అనుదీప్‌  ఇక్కడ ‘పవన్‌ కల్యాణ్‌’ అనే స్ట్రాంగ్‌ మసాలా మిక్స్ చేశాడు. సినిమా మొత్తం పవన్‌ కల్యాణ్ క్రేజ్‌తో ముడిపడి ఉంటుంది కాబట్టి పవర్‌ స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటారు. ఫస్ట్ డే టికెట్ల కోసం పడే పాట్లు పాత రోజులను గుర్తుచేస్తాయి.థియేటర్‌ సీన్లు చాలా సహజంగా తీశారు. అంటే నోస్టాల్జిక్ ఫీలింగ్‌ తీసుకొస్తాయన్నమాట. వెన్నెల కిశోర్‌ ఫస్ట్‌ హాప్‌ తెగ నవ్విస్తాడు. తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మహేశ్‌ తమ పాత్రల మేరకు బాగానే నవ్వించారు. సినిమాకు పాజిటివ్‌ అంటే అది ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీనే. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి సినిమా చాలా నెమ్మదిస్తుంది. కామెడీకి స్కోప్‌ తగ్గుతుంది. దానికి తోడు రొటిన్ లవ్‌ స్టోరీని చాలా మంది బోరింగ్‌గా ఫీల్‌ అవుతారు. సినిమా చూసిన అనేక మంది ట్విట్టర్‌ రివ్యూస్‌లో కూడా ఇదే చెప్పారు. ఇక సాంకేతిక విలువలు, మ్యూజిక్‌ యావరేజ్‌ అనిపిస్తుంది.

    సినిమాకు బలాలు:

    ఫస్టాఫ్‌ కామెడీ

    పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌

    వెన్నెల కిశోర్‌

    బలహీనతలు

    రొటీన్‌ స్టోరీ,

    సెకండాఫ్‌

    ఇంతకీ చూడొచ్చా

    మీరు పవన్‌ కల్యాణ్‌ అభిమాని అయితే పక్కాగా చూడొచ్చు, అలాగే నాకు స్టోరీతో సంబంధం లేదు నవ్వుకుంటే చాలు అనుకునేవాళ్లకు సినిమా నచ్చుతుంది. కానీ రొటీన్‌ స్టోరీస్‌, కామెడీని బోరింగ్‌గా ఫీలయ్యేవారికి మాత్రం సినిమా బోర్‌ కొట్టొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version