ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈగల బెడద చాలా మందిని వేధిస్తోంది. ఈగలు తమతో పాటు ఎన్నో సూక్ష్మక్రిములను తీసుకొస్తాయి. అవి ఇంట్లోని పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈగలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వారిని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. అందుకే ఈగలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఈ చిట్కాలను పాటిస్తే ఈగల గోల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే అమెజాన్ సైతం ఈగలను నివారించే ప్రాడక్ట్స్‌ను ఆఫర్ చేస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పరిశుభ్రత ముఖ్యం
ఇంట్లో గానీ, ఇంటి చుట్టు పక్కల గానీ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. అవే ఈగలకు స్థావరంగా ఉంటాయి. అక్కడి నుంచే అవి ఇంట్లోకి వస్తాయి. కాబట్టి అపరిశుభ్ర ప్రాంతాలపై జాగ్రత్త అవసరం.
గార్డెన్‌పై కన్నేయండి..!
ఇంటి పరిసరాల్లోని గార్డెన్, పెంచుకునే మెుక్కలు, పొదలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు పడుతున్న సమయంలో అపరిశుభ్రతకు అసలు తావివ్వకూడదు. దీని వల్ల ఇంట్లో వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంది.
కర్పూరం పొగ
ఈగల బెడద ఎక్కువగా ఉంటే ఇంట్లోని కర్పూరంతోనే వాటిని నివారించవచ్చు. కర్పూరం పొగ ఈగలకు అసలు పడదు. ఈ నేపథ్యంలో కర్పూరం వెలిగించి ఆ పొగను ఇల్లంతా విస్తరించేలా చేయండి. దీంతో ఈగలు దెబ్బకు పారిపోతాయి. లేదంటే అమెజాన్‌లో ‘ZYAX Housefly Maxx’ అనే స్ప్రే అందుబాటులో ఉంది. దాన్ని స్ప్రే చేసిన ఈగలు వెళ్లిపోతాయి.
ఆల్ట్రావయోలెట్ ట్రాప్స్
ఈగలతో పాటు దోమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే ఆల్ట్రావయోలెట్ ట్రాప్స్‌ను ఏర్పాటు చేయాలి. ఇవి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అమెజాన్‌లో ఆల్ట్రావయోలెట్ ట్రాప్స్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా Eloxee కంపెనీ ట్రాప్ ల్యాంప్ ట్రై చేయండి. ఇది రూ.444 అందుబాటులో ఉంది.
తులసి మెుక్క
ఇంట్లో తులసి మెుక్కలను పెంచినట్లయితే ఈగల నివారిణిగా ఉపయోగపడతాయి. తులసి ఆకుల వాసనతో ఈగలు దూరంగా వెళ్లిపోతాయి.
ఎలక్ట్రిక్ ఫ్లై ట్రాప్
ఈగలను నివారించేందుకు అమెజాన్‌లో సరికొత్త ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. Electric Fly Trapను కొనుగోలు చేస్తే ఈగలను తేలిగ్గా బందించవచ్చు. ఇందుకోసం ముందుగా ఈ ట్రాప్ బాక్స్‌పై ఈగలను ఆకర్షించే ఆహారాన్ని ఉంచాలి. అనంతరం ఈ బాక్స్‌ను ఆన్ చేయాలి. బాక్స్ రొటేట్ అవుతున్న క్రమంలో ఆహారం కోసం వచ్చిన ఈగలు ఆటోమేటిక్‌గా ట్రాప్ బాక్స్‌లో చిక్కుకుపోతాయి.
ఆ మెుక్కలతో ఈగలకు చెక్
పుదీనా, లావెండర్, బంతిపువ్వు మెుక్కలను పెంచినా మంచిదే. వీటి వాసనతో ఈగలు ఇంటి పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉందడు. మీరూ ఈ మెుక్కలను పెంచి చూడండి. ఫలితం చూసి ఆశ్చర్యపోతారు.
వీటితో ఈగలు మటుమాయం
లావెండర్, యూకలిప్టస్, పెప్పర్ మింట్, లెమన్ గ్రాస్ నూనెలను చల్లినా, స్ప్రే చేసినా ఈగలు పారిపోవాల్సిందే. లేదంటే అమెజాన్‌లో లభిస్తున్న గుడ్ మార్నింగ్ ఫ్లై కిల్లర్ స్ప్రే పౌడర్‌ను ట్రై చేసినా మంచి ఫలితం ఉంటుంది.
లవంగాలతో అడ్డుకట్ట
ఆపిల్‌ను ముక్కలుగా కోసి దానిపై లవంగాలను గుచ్చాలి. ఆ వాసనతో ఈగలు పారిపోతాయి. లవంగాల నూనె పెట్టినా బాగానే పనిచేస్తుంది. లవంగాల నూనె అమెజాన్‌లో రూ.199లకే లభిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం