Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?

  Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?

  March 9, 2024

  విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 

  డే1 కలెక్షన్స్‌ ఎంతంటే?

  గామి సినిమా మొదటి రోజే (Gaami Day 1 Collections) రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా తొలి రోజు 2.50 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 1 మిలియన్‌ డాలర్స్‌ దిశగా ‘గామి’ పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. విష్వక్‌ సేన్‌ ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే అత్యధిక డే వన్‌ కలెక్షన్స్‌ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. 

  సాక్నిక్‌ లెక్కల ప్రకారం

  గామి చిత్రం తొలిరోజు కలెక్షన్స్‌ను ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) కూడా ప్రకటించింది. ఈ సినిమా తొలి రోజు రూ. 4.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Gaami Day1 Net Collections)ను వసూలు చేసినట్లు తన సైట్‌లో పేర్కొంది. అయితే వరల్డ్‌ వైడ్‌గా ఎంత వసూళ్లను రాబట్టిందోనన్న విషయాన్ని మాత్రం సాక్నిక్‌ తన సైట్‌లో ప్రస్తావించలేదు. అటు ‘గామి’ ఫస్ట్‌డే రోజున చెప్పుకోతగ్గ స్థాయిలో థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్నిక్‌ తెలిపింది. మార్కింగ్‌ షోకు 45.58%, మధ్యాహ్నం 56.47%, సాయంత్రం 49.88%, సెకండ్ షో 71.69% ఆక్యుపెన్సీ రేట్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఈ వీకెండ్‌లో ఆక్యుపెన్సీతో పాటు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషించింది. 

  ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే?

  విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గామి‘ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. అంటే గామి హిట్ అవ్వాలంటే రూ. 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. తొలిరోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ మూవీ ఈజీగానే లాభాల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

  విష్వక్‌ నటనపై ప్రశంసలు

  అఘోరా శంకర్‌ పాత్రలో విశ్వక్‌ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. శంకర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అతడు నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో. యాక్ష విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version