Gaami Trailer Review: ‘గామి ట్రైలర్‌’లో.. ఆ ఒక్కటి మాత్రం అదిరిపోయింది!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Gaami Trailer Review: ‘గామి ట్రైలర్‌’లో.. ఆ ఒక్కటి మాత్రం అదిరిపోయింది!

    Gaami Trailer Review: ‘గామి ట్రైలర్‌’లో.. ఆ ఒక్కటి మాత్రం అదిరిపోయింది!

    విశ్వక్ సేన్ (Visvak Sen) హీరోగా కొత్త డైరెక్టర్‌ విద్యాధర్ కాగిత రూపొందిస్తున్న చిత్రం ‘గామి’ (Gaami). ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్‌ ఇప్పటికే ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ను విడుదల చేశారు. వీటిలో అఘోరా లుక్‌లో విశ్వక్‌ కనిపించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ‘గామి’పై పడింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా విచ్చేసి రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో విశ్వక్‌ నటన ఎలా ఉంది? సినిమా స్టోరీ ఏమై ఉండవచ్చు? టెక్నికల్‌ టీమ్ పని తనం ఎలా ఉంది? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. 

    Gaami Trailer | Vishwak Sen | Chandini Chowdary | Vidyadhar Kagita | UV Creations
    ట్రైలర్‌లో ఏముంది?

    ‘నేను ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చానో.. నాకీ సమస్య ఎప్పటినుంచో ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదు’ అంటున్న విశ్వక్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో విశ్వక్‌కు ఒక సమస్య ఉంది.. వేరే మనిషి అతడిని పట్టుకున్నా.. ముట్టుకోవాలని దగ్గరకు వచ్చినా అతనికి శరీరం అంతా పగిలిపోతూ ఉంటుంది. మానవ స్పర్శ అతడికి తగలకూడదు. అఘోర అయిన శంకర్ తనకున్న సమస్యను పోగొట్టుకోవాలంటే.. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకాల్సి ఉంటుంది. అక్కడకు శంకర్ చేసే ప్రయాణమే గామి కథ. ఈ ప్రయాణంలో నటి చాందిని శంకర్‌కు సాయం చేస్తుంది. అయితే ట్రైలర్‌లో మరో రెండు ప్రశ్నలను సంధించాడు డైరెక్టర్‌. దేవదాసి నుంచి ఒక మహిళను సాదారణ గృహిణిగా మార్చడం.. ఆమె ఊరి నుంచి పారిపోవడం.. ఆమెను తీసుకురాకపోతే గ్రామంకు అనర్థమని చెప్పుకొచ్చారు. ఇంకోపక్క ఎవరు లేని ఒక ప్రదేశంలో కొంతమందిని ఖైదీలుగా చూపించారు. అక్కడనుంచి ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించడం చూపించారు. అసలు ఈ రెండు ఘటనలకు.. శంకర్‌కు ఏంటి సంబంధం? అసలు శంకర్‌కు ఆ సమస్య ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలను ట్రైలర్‌ ద్వారా డైరెక్టర్‌ సంధించారు. సినిమాపై అందరికీ మరింత ఆసక్తి కలిగేలా చేశాడు. 

    విశ్వక్‌ నటన

    ట్రైలర్‌లో విశ్వక్‌ నటన చూస్తే గూస్‌బంప్స్‌ రావాల్సిందే. ఓ సమస్యతో బాధపడుతున్న శంకర్‌ అనే అఘోరా పాత్రలో అతడు జీవించేశాడు. తాను తప్ప మరొకరు ఈ పాత్రలో చేయలేరన్న విధంగా క్యారెక్టర్‌లో లీనమైపోయినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా విశ్వక్‌ నటన మరోస్థాయికి వెళ్తుందని అనిపిస్తోంది. 

    టెక్నికల్‌ టీమ్‌

    గామి సినిమాకు టెక్నికల్‌ టీమ్‌ ప్రధాన బలం కానుందని ట్రైలర్‌ చెప్పకనే చెబుతోంది. నరేష్‌ కుమారన్‌ అందించిన నేపథ్య సంగీతం.. ట్రైలర్‌లో ప్రతీ ఒక్కరినీ లీనమయ్యేలా చేసింది. ఇక సినిమాటోగ్రాఫర్‌ విశ్వనాథ్‌ రెడ్డి.. కెమెరా పని తనం ఆకట్టుంది. ట్రైలర్‌లో వీఎఫ్‌ఎక్స్‌ అదరహో అనిపించేలా ఉన్నాయి. వీరి పూర్తి పనితనం తెలియాలంటే సినిమా చూసేవరకూ ఆగాల్సిందే.

    బలాలు

    డైరెక్టర్‌  విద్యాధర్ కాగిత ఈ సినిమాకు యునిక్‌ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు ట్రైలర్‌ను బట్టే అర్థమవుతోంది. కథానాయకుడు అనారోగ్య సమస్యతో బాధపడటం చాలా సినిమాల్లో చూసినప్పటికీ దాని పరిష్కారాన్ని 36 ఏళ్ల తర్వాత వికసించే పువ్వుతో మూడి పెట్టడం ఆసక్తికరం. విజువల్స్‌, నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 

    బలహీనతలు

    ఈ ట్రైలర్‌లో ప్రత్యేకించి బలహీనతలు అంటూ ఏమి లేవు. ప్రస్తుతం బలాలుగా భావిస్తున్న వీఎఫ్ఎక్స్‌, సంగీతం, కథ.. పూర్తి సినిమాకు వచ్చే సరికి ఎలా మారాతాయా? అన్నదే ఇక్కడ ప్రశ్న. ట్రైలర్‌ బాగుండి.. సినిమా ఫ్లాప్ అయిన అనుభవాలు ఆడియన్స్‌కు గతంలో చాలానే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ట్రైలర్‌లో ప్లస్‌ అయిన అంశాలు.. సినిమాకు వచ్చే సరికి మైనస్‌ కాకూడదని ఆశిద్దాం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version