మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్, అప్‌డేట్స్ విషయంలో గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలోనైనా ప్రమోషన్స్‌పై మూవీ టీమ్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్ ఈవెంట్స్ ఏ తేదీల్లో, ఎక్కడ జరగనున్నాయో ముందే చెప్పేశారు. దీంతో మెగా ప్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ప్రమోషన్ ప్లాన్స్ రివీల్
గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రమోషన్ ఈవెంట్స్‌పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రమోషన్స్‌పై తమ ప్లాన్ ఎంటో తెలియజేశారు. ఈ నెల 9న లక్నోలో టీజర్ లాంచ్ చేయనున్నట్లు దిల్‌రాజు చెప్పారు. ఆ తర్వాత అమెరికాలోని డల్లాస్‌లో ఓ భారీ ఈవెంట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం చెన్నైలో మరో ఈవెంట్ ఉండనున్నట్లు తెలిపారు. జనవరి తొలి వారంలో ఏపీ, తెలంగాణల్లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పారు.. జనవరి 10న సంక్రాంతి స్పెషల్‌గా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ పేర్కొన్నారు. సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా గేమ్ ఛేంజర్‌లో ఉంటుందని దిల్‌రాజు చెప్పారు.
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ నిర్వహించాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్ ప్లేసులో ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ అయిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్ ఆహ్వానాన్ని పవన్ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
దిల్ రాజు 50వ చిత్రంగా..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్ ఛేంజర్ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు ‘గేమ్ ఛేంజర్’కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
శంకర్ ఫామ్‌తో కలవరం!
RRR వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత శంకర్‌తో రామ్‌చరణ్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ ఎగిరిగంతేశారు. అయితే ఇటీవల శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘భారతీయుడు 2’ డిజాస్టర్‌తో వారి ఉత్సాహం పూర్తిగా దెబ్బతింది. ‘భారతీయుడు 2’ అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ డైరెక్షన్‌పై మెగా అభిమానుల్లో అనుమానాలు ఏర్పడ్డాయి. ’గేమ్ ఛేంజర్’ అటు ఇటు అయితే తీవ్ర నిరాశ తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శంకర్‌కు సైతం సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజు కూడా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో తీవ్రంగా నష్టపోయి గేమ్ ఛేంజర్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ట్రెండింగ్‌లో అన్‌ప్రిడిక్టబుల్
గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి అన్‌ప్రిడిక్టబుల్ (#Unpredictable) పదం రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం ఏంటో తెలియక చాలా మంది నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ‘అన్‌ప్రిడిక్టబుల్’ అనేది గేమ్ ఛేంజర్ టీజర్‌లో ఉండే శక్తివంతమైన లైన్ అని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. చరణ్ నోట ఈ పదం వస్తుందని అంటున్నారు. దీంతో సినిమాలోని ఏ సందర్భంలో చరణ్ ఈ పదం వాడతారోనని అభిమానులు ఇప్పటినుంచే తెగ థింక్ చేస్తున్నారు. కాగా, నవంబర్ 9న రాబోయో టీజర్ 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉంటుందని అంటున్నారు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్ రికార్డు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!