‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ గురించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. అదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ వార్త కూడా నెట్టింట ప్రచారం జరుగుతోంది. వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నో చెప్పిన రామ్‌చరణ్!
‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ తన ఫోకస్‌ను తర్వాతి చిత్రంపైకి మళ్లించారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో రానున్న ‘RC16’ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు బాడీని సైతం పెంచాడు. అయితే దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించిన కొన్ని సీన్లపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో చరణ్‌తో వాటిని రీషూట్ చేాయాలని ఆయన భావించారట. ఈ మేరకు నిర్మాత దిల్‌రాజు ద్వారా రామ్‌చరణ్‌కు సందేశం కూడా పంపినట్లు తెలుస్తోంది. అయితే దీనికి రామ్ చరణ్ నో చెప్పినట్లు సమాచారం. తిరిగి ‘గేమ్ ఛేంజర్’ లుక్‌లోకి మారితే ‘RC16’ షూటింగ్‌లో జాప్యం జరుగుతుందని ఆయన భావించారట. ఇప్పటికే ‘RC16’ కోసం డేట్స్ కూడా ఇవ్వడంతో వాటిని అడ్జస్ట్ చేసుకునేందుకు చరణ్ సంసిద్ధంగా లేరని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
శంకర్‌పై అసంతృప్తి!
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ కోసం రామ్ చరణ్ పూర్తిగా సమయాన్ని కేటాయించారు. అయితే దర్శకుడు శంకర్ మాత్రం ప్యార్లర్‌గా ‘భారతీయుడు 2’ చిత్రాన్ని సైతం డైరెక్ట్ చేస్తూ పలు మార్లు ‘గేమ్ ఛేంజర్’కు బ్రేకులు వేశారు. ఒకానొక సందర్భంలో గేమ్ ఛేంజర్‌ను పూర్తిగా పక్కకి పెట్టేశారు. దీంతో రెండునెలల పాటు షూట్ జరగలేదు. ఇలా పలుమార్లు ‘గేమ్ ఛేంజర్’ ఆగిపోవడంతో రామ్‌చరణ్ తీవ్ర అసహనానికి లోనయ్యారట. ఎట్టకేలకు ఈ సినిమా షూట్ పూర్తికావడంతో ఊపిరిపీల్చుకున్నారట. ఇప్పుడు మళ్లీ రీషూట్ పేరిట శంకర్ నుంచి పిలుపురావడం చెర్రీకి అసలు నచ్చలేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. రెండు సంవత్సరాల కాలాన్ని ‘గేమ్ ఛేంజర్’కు అంకింత చేసినా మళ్లీ డేట్స్ అడగటంపై రామ్‌చరణ్ గుర్రుగా ఉన్నారట. ఆయన నో చెప్పిటానికి ‘RC16’ ప్రాజెక్ట్‌తో పాటు ఇదీ ఓ కారణమని నెట్టింట టాక్ వినిపిస్తోంది.
సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది!
‘గేమ్ ఛేంజర్’ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ‘సెకండ్ సింగిల్’ రిలీజ్‌కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 28న సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. పల్లవిలోని లైన్స్ చూస్తుంటే మ్యూజికల్ సెన్సేషన్ తమన్ పక్కా మాస్ బీట్ ఇచ్చాడని ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి వచ్చిన ‘జరగండి జరగండి’ పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఆశలన్నీ ‘గేమ్ ఛేంజర్’ పైనే!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్