గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
టీజర్ గ్రాండ్ రిలీజ్
రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ను లక్నోలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంది.
త్రీ డిఫరెంట్ లుక్స్‌లో…
కాలేజీ బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు కానీ వాడికి కోపం వస్తే.. వాడంతా చెడ్డోడు ఇంకొకడు ఉండడు అన్న డైలాగ్‌తో టీజర్ మెుదలైంది. ఇందులో చరణ్ త్రీ డిఫరెంట్ డైమన్షన్స్‌లో కనిపించాడు. పాతకాలం వ్యక్తిలా, కాలేజీ కుర్రాడిలా, ప్రభుత్వ ఆఫీసర్‌గా ఇలా మూడు లుక్స్ అదరగొట్టాడని చెప్పవచ్చు. టీజర్‌ను ఎక్కువగా యాక్షన్ సీన్స్, సినిమాలోని అన్ని రకాల సీన్స్ కట్స్‌తో అదిరిపోయే BGMతో పర్ఫెక్ట్‌గా కట్ చేశారు. చివర్లో చరణ్ ‘ఐ యాం అన్ ప్రిడిక్టబుల్’ అంటూ స్టైలిష్‌గా డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఈ ఒక్క డైలాగ్‌తో సినిమాలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయని రామ్ చెప్పకనే చెప్పాడు.
ఫ్యాన్స్.. మాస్ సెలబ్రేషన్స్
గేమ్ ఛేంజర్ టీజర్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్ణాటకలోని 11 నగరాల్లో 11 థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తొలుత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ప్రతిభా థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో టీజర్‌ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. అటు ఏపీలోని వైజాగ్ (సంగం-శరత్ థియేటర్), రాజమండ్రి (శివజ్యోతి థియేటర్), విజయవాడ (శైలజా థియేటర్), కర్నూల్ (వి మెగా థియేటర్), నెల్లూర్ (S 2 థియేటర్), బెంగళూరు (ఊర్వశి థియేటర్), అనంతపూర్ (త్రివేణి థియేటర్), తిరుపతి (పీజీఆర్ థియేటర్) నగరాల్లో టీజర్ విడుదలైంది. టీజర్ రిలీజ్‌కు ముందే భారీగా అయా థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్!
‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో గ్రాండ్ నిర్వహించాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తే లక్షలాది మంది అభిమానుల సమక్షంలో ఓపెన్ ప్లేసులో ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ అయిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు పిలిచే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో మూవీ టీమ్ ఆహ్వానాన్ని పవన్ కాదనే ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
దిల్ రాజు 50వ చిత్రంగా..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫిల్మ్ కెరీర్‌లో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 50వ చిత్రంగా రానుంది. గేమ్ ఛేంజర్ స్టోరీని మూడేళ్ల క్రితమే శంకర్ చెప్పినట్లు దిల్‌రాజు తెలిపారు. ఆ కాన్సెప్ట్ వినగానే ఎంతో ఆసక్తి కలిగిందని చెప్పారు. సహ నిర్మాత ఆదిత్య రామ్ తనకు మంచి స్నేహితుడని, నాలుగు తెలుగు సినిమాలు సైతం ప్రొడ్యూస్ చేశారని చెప్పారు. అయితే వ్యాపార నిమిత్తం చెన్నైలో అతడు బిజీ అయ్యారని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరగానే ఆదిత్య రామ్ వెంటనే సరే అన్నారని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఆదిత్య రామ్ మూవీస్ సంస్థలు ‘గేమ్ ఛేంజర్’కే కాకుండా భవిష్యత్‌లో మరికొన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం