Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

    Geethanjali Malli Vachindi Review: కడుపుబ్బా నవ్వించిన గీతాంజలి సీక్వెల్‌.. సినిమా హిట్టా? ఫట్టా?

    April 12, 2024

    నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, అంజలి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవి శంకర్, సత్య తదితరులు.

    దర్శకుడు: శివ తూర్లపాటి

    సంగీత దర్శకుడు: ప్రవీణ్ లక్కరాజు

    సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

    ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

    నిర్మాత: కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం వివి సినిమాస్

    ప్రముఖ హీరోయిన్‌ ‘అంజలి’ లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ చిత్రం ఎలా ఉంది? ప్రీక్వెల్‌ లాగానే ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి

    దర్శకుడు శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) హ్యాట్రిక్‌ ఫ్లాపులతో ఆర్థికంగా దెబ్బతింటాడు. పొట్టకూటి కోసం మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య సత్య హీరోగా ఓ సినిమా అవకాశం వస్తుంది. ఊటీలో రిసార్టు నడుపుతున్న అంజలి ఇందులో హీరోయిన్‌గా చేసేందుకు ఒప్పుకుంటుంది. అయితే దెయ్యాల కోటగా పిలవబడుతున్న సంగీత్‌ మహల్‌లోనే షూటింగ్ జరపాలని ప్రొడ్యూసర్ ఓ కండీషన్‌ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ సంగీత్‌ మహల్‌ గతం ఏంటి? మహల్‌లో షూటింగ్‌ మెుదలుపెట్టిన శ్రీను & టీమ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    ప్రముఖ నటి అంజలి ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన అద్భుత నటనతో అదరగొట్టింది. పతాక సన్నివేశాల్లో తన అత్యుత్తమ యాక్టింగ్‌తో మెప్పించింది. కొన్ని హార్రర్‌ సీన్లలో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడిగా శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌, సత్యం రాజేష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్‌ నానిగా సునీల్‌ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్‌ మాధవ్‌ నటన మెప్పిస్తుంది. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    ఈ సీక్వెల్‌ మూవీ.. తొలి భాగం చూడనివారికి కూడా అర్థమయ్యేలా డైరెక్టర్‌ శివ తుర్రపాటి తెరకెక్కించారు. ప్రథమార్ధంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సంగీత మహల్‌కు వెళ్లిన తర్వాత అసలు కథను మెుదలుపెట్టాడు. ఆ మహల్‌ చరిత్ర… అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరును దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ క్రమంలో తీసుకొచ్చిన విరామ సన్నివేశాలతో ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే కథ పరంగా చూస్తే లాజిక్‌కు దూరంగా చాలా అంశాలే ఉన్నాయి. బలమైన ఎమోషన్స్‌ కూడా కొరవడ్డాయి. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మెరుపులు లేవు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లు సంభాషణలు రాసుకోవడం కాస్త ప్లస్ అయ్యింది. ఓవరాల్‌గా దర్శకుడిగా శివ తన పాత్రకు కొంతమేర న్యాయం చేశారు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకి సుజాత సిద్ధార్థ కెమెరా పనితనం బాగా కలిసొచ్చింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్‌ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్

    • అంజలి నటన
    • కామెడీ సన్నివేశాలు
    • కొన్ని హార్రర్‌ అంశాలు

    మైనస్‌ పాయింట్స్‌ 

    • కథలో బలం లేకపోవడం
    • లాజిక్‌కు అందని సీన్లు

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version