చలికాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉదయం చలి తీవ్రతను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇక చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఉదయం స్నానం చేయడం. చల్లటి నీటితో స్నానం చేయడమంటే నరకాన్ని కొని తెచ్చుకున్నట్లే. అయితే ఈ సమస్యకు వాటర్ గీజర్ల ద్వారా చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.5000 బడ్జెట్‌లో బెస్ట్ గీజర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Hindware Atlantic Xceed 10L
ఈ వాటర్ గీజర్ 10 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 230 Volts పవర్‌తో 72 Degrees Celsius హీట్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని ప్లాస్టిక్ మెటిరియల్‌తో తయారు చేశారు. 5 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. దీనిని ఎంతో తేలిగ్గా గోడకు అమర్చుకోవచ్చు. అమెజాన్‌లో 50 డిస్కౌంట్‌తో రూ.4,999లకు ఈ గీజర్ లభిస్తోంది.
Polycab Etira Plus 5Ltr
ఈ వాటర్ గీజర్ ఐదు లీటర్ల సామర్థ్యంతో తయారైంది. యాంటీ రస్ట్ ట్యాంక్‌తో పాటు మల్టీ లేయర్ రక్షణను కలిగి ఉంది. ఇన్నర్ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఈ ట్యాంక్ తుప్పు పట్టదని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ షాక్ నుంచి కూడ రక్షణ ఉంటుందని చెప్పింది. అమెజాన్‌లో ఇది రూ.3,115లకు లభిస్తోంది.
COMRADE Prizma Water Geyser
ఈ గీజర్ 4.5 KW పవర్‌తో పనిచేస్తుంది. స్లీక్ డిజైన్‌తో తయారు చేశారు. ఇది నీటిని త్వరగా వెడెక్కేలా చేస్తుంది. ఈ గీజర్ సామర్థ్యం 5 లీటర్లు. దీని అసలు ధర రూ. 5,990. కానీ అమెజాన్ దీనిని రూ.3,099లకు అందిస్తోంది.
Amplesta Instaflow 5L
ఇది 5 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3KW పవర్‌తో పని చేస్తుంది. దీని ట్యాంక్ తుప్పు పట్టదు. ఎన్నో సేఫ్టి ఫీచర్లతో దీనిని నిర్మించారు. ఇన్నర్ ట్యాంక్‌పై 5 సంవత్సరాల వారంటీ ఉంది. ఈ హీటర్ ధర రూ. 2,949.
Crompton Gracee 5L
క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ గ్లీజర్‌ను గోడకు ఫిక్స్ చేయవచ్చు. అత్యాధునిక సెఫ్టీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 3000W పవర్, 5 లీటర్ల ట్యాంక్ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీని అసలు ధర రూ.7,299. కానీ అమెజాన్ రూ.3,498లకు గీజర్‌ను అందిస్తోంది.
V-Guard Zio
తక్కువ బడ్జెట్‌కో వీ గార్డ్ కంపెనీ గీజర్‌ను కోరుకునేవారు దీన్ని ట్రై చేయవచ్చు. ఇది 3 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 3000W పవర్‌ను వినియోగించుకుంటుంది. ఈ గీజర్ పవర్ హీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ గీజర్ రూ.2,699 లభిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం