GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?

    GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?

    October 5, 2022

    మలయాళంలో మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులో గాడ్ ఫాదర్‌గా డెరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు.ఈ సినిమా దసరా రోజు బుధవారం ప్రేక్షకులను పలకరించింది. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో ఎలా నటించారు? రిమెక్ మూవీని హిట్‌గా మలచగలిగారా? చిరంజీవి- సల్మాన్ ఖాన్ కాంబో ఎలా ఉంది?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం

    కథేంటి..?

    రాష్ట్ర సీఎం చనిపోయాక తన అల్లుడు జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనుకుంటాడు. కానీ అతనికి అడ్డుగా బ్రహ్మ( చిరంజీవి) నిలబడుతాడు. అసలు బ్రహ్మకు సీఎంకు సంబంధం ఎంటీ? బ్రహ్మ, జయదేవ్‌ను ఎందుకు సీఎం కాకుండా అడ్డుకోవాలనుకుంటాడు. జయదేవ్ సీఎం కాకుండా బ్రహ్మ ఆపగలిగాడా లేదా? అన్నది కథ. ఈ కథకు చక్కని ఫ్యామిలీ యాంగిల్‌ అనేది జోడించారు. అది మాత్రం సినిమాలోనే చూడాలి. 

    ఎవరెలా చేశారు..?

    మెగాస్టార్ చిరంజీవి తనకే సాధ్యమైన మ్యానరిజంతో గొప్పగా నటించారు. ఆయన స్టార్‌డమ్‌కు తగ్గట్టుగా పర్‌ఫెక్ట్‌గా సీన్లు పడ్డాయి. సత్యదేవ్ తన పాత్రకు 100శాతం న్యాయం చేశారు. సత్యదేవ్ వల్లే జయదేవ్ పాత్ర లేచింది. నయనతార పాత్రలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. సునీల్, షయాజీ షిండే, దివి, మురళి శర్మ తమ పాత్రల పరిధి తక్కువైనా బాగా నటించారు. ఇక సల్మాన్ రోల్ నిరాశపరిచింది. అయితే  సల్మాన్ ఖాన్- చిరంజీవి మధ్య సీన్లు ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే థార్ మార్ థక్కర్ మార్ సాంగ్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.

    బలాలు- బలహీనతలు

    మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ ఎక్సలెంట్‌గా డిజైన్ చేశారు. మొదటి 10 నిమిషాల్లోనే సినిమాకు సంబంధించి హైపీక్ సీన్స్ పడ్డాయి. అభిమానులకు మంచి మాజా ఇస్తుంది. చిరంజీవి కారును ఆపే సీన్ హైలెట్. ఆసీన్‌లో మెగాస్టార్‌ను థమన్ BGMతో చూసినప్పడు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్. ఆ సీన్‌తో బ్రహ్మకు, జయదేవ్‌కు మధ్య కాన్‌ప్లిక్ట్ మొదలవుతుంది. ప్రీ ఇంటర్వెల్‌కు ముందు వచ్చే చిరంజీవి జైలు సీన్ మూవీకే హైలెట్. ఫస్టాఫ్ మొత్తం మాస్ డ్రామాతో, ఫ్యాన్ మూమెంట్‌తో వెళ్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి జయదేవ్ పాత్ర పవర్ తగ్గిపోతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్లు అంతగా మెప్పించవు.

    సాంకేతికంగా..?

    సినిమాటోగ్రాఫర్ నిరోషా అద్భుతంగా కెమెరా వర్క్ చేశారు. థమన్ సాంగ్స్ అంత గొప్పగా అనిపించకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. మార్తండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగా చేశారు. యాక్షన్ కొరియోగ్రఫి సూపర్బ్. 

    చివరగా: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు ‘గాడ్ ఫాదర్’ మంచి దసరా విందు భోజనం

    రేటింగ్: 3.25/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version