Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

    Google Pixel 7a Review: గూగుల్‌ నుంచి మరో సరికొత్త ఫోన్.. అదరగొడుతున్న అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!

    May 11, 2023

    మెుబైల్‌ తయారీ కంపెనీలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఏటా కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్‌ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గూగుల్‌ పిక్సెల్‌ 7 నుంచి మూడో మోడల్‌ను తీసుకొచ్చింది. Google Pixel 7a పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర ఎంత? ఈ మెుబైల్‌ ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది? మెుబైల్‌ ప్రియులను ఆకర్షించే ఫీచర్లు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. 

    ఒలెడ్‌ డిస్‌ప్లే

    గూగుల్‌ పిక్సెల్‌ 7a ఫోన్‌ను 6.1 అంగుళాల ఫుల్‌ HD+ స్క్రీన్‌తో తీసుకొచ్చింది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో OLED డిస్‌ప్లేను దీనికి అమర్చారు. గతంలో వచ్చిన పిక్సెల్‌ సిరీస్‌ రిఫ్రెష్‌ రేటు 60Hz గా ఉండగా ఈ ఫోన్‌లో దాన్ని మరింత అడ్వాన్స్‌డ్‌గా తీసుకొస్తున్నారు. అలాగే మెుబైల్‌ స్క్రీన్‌ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్‌ 3 వినియోగించారు. అలాగే ఈ ఫోన్‌ Tensor G2 SoC చిప్‌తో రానుంది.

    కెమెరా

    గూగుల్‌ పిక్సెల్‌ సిరీస్‌లో వచ్చిన ఫోన్లతో పోలిస్తే 7a మోడల్‌లో కెమెరా క్వాలిటీని మరింత పెంచారు. ప్రైమరీ కెమెరాను 64 మెగా పిక్సల్‌తో తీసుకొచ్చారు. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సల్‌ ఉంది. అల్ట్రా వైడ్‌ యాంగిల్‌తో దీన్ని తీసుకొచ్చారు. 

    వైర్‌లెస్‌ ఛార్జింగ్

    గూగుల్‌ పిక్సెల్‌ 7a 4,385 mAh బ్యాటరీతో వస్తోంది. పిక్సెల్‌ 6a మోడల్‌తో పోలిస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని కాస్త తగ్గించారు. గూగుల్ తొలిసారిగా పిక్సెల్ 7aలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ని ప్రవేశపెట్టింది.

    Qi ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది పనిచేస్తుంది. అలాగే ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. చార్జర్‌ ద్వారా కూడా ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. రెండు రకాలుగా బ్యాటరీని ఫుల్‌ చేసుకోవచ్చు. 

    5G సపోర్ట్

    గూగుల్‌ పిక్సెల్‌ 7a ఆండ్రాయిడ్‌ 13తో వస్తోంది. కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌ 14 బేటా వర్షన్‌కి కూడా మారవచ్చు. ఈ ఫోన్‌ 8GB LPDDR5 RAM, 128GB UFS 3.1 ఇంటర్నల్‌ స్టోరేజీ కలిగి ఉంది. అలాగే Wi-Fi 6e, Bluetooth v5.3, NFC వంటి కనెక్టింగ్‌ ఫీచర్లు ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. 5Gకి కూడా పిక్సెల్‌ 7a సపోర్ట్‌ చేస్తుందని గూగుల్‌ పేర్కొంది. 

    కలర్స్‌

    గూగుల్‌ పిక్సెల్‌ 7a మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంది. చార్‌ కోల్‌, స్నో, సీ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపికచేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    భారత్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 7a మోడల్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ మే 11 నుంచి ఫోన్ సేల్స్‌ను ప్రారంభించింది. దీని ధరను రూ.43,999 నిర్ణయించింది. HDFC బ్యాంక్‌ కార్డ్స్‌తో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకూ డిస్కౌంట్‌ పొందొచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version