Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!

    Google Pixel Fold Review: మార్కెట్‌లోకి గూగుల్‌ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌.. ఆకర్షిస్తున్న స్టన్నింగ్‌ ఫీచర్స్!

    May 11, 2023

    టెక్‌బ్రాండ్ గూగుల్.. ‘Google I/O 2023’ పేరుతో నిర్వహించిన లాంచ్‌ ఈవెంట్‌ అట్టహాసంగా జరిగింది. బుధవారం (మే 10) జరిగిన ఈ కార్యక్రమంలో ‘పిక్సెల్ 7a’ ఫోన్‌తో పాటు, తన ఫస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను గూగుల్‌ లాంచ్‌ చేసింది. ఇది గూగుల్ టెన్సర్ G2 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13, ట్రిపుల్ రియర్ కెమెరా, 180 డిగ్రీ ఫోల్డింగ్ హింగ్ వంటి స్టన్నింగ్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఫోన్‌లో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

    బిగ్‌ డిస్‌ప్లే

    గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉన్న 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేతో వస్తోంది.దీనికి 5.8 అంగుళాల ఫుల్ HD+ OLED ఔటర్ డిస్‌ప్లే కూడా ఉంది. అవుటర్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో, ఇన్నర్ డిస్‌ప్లే ప్లాస్టిక్ కోటింగ్‌తో నిర్మించారు. ఇందులో టైటాన్ M2 సెక్యూరిటీ చిప్, టెన్సర్ G2 SoC చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది.

    కెమెరా

    గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో కూడిన 48-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. మిగిలిన సెటప్‌లో 10.8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ డ్యుయల్ PD టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో కవర్ డిస్‌ప్లేపై 8 MP సెల్ఫీ కెమెరా, లోపలి భాగంలో 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

    5G సపోర్ట్

    పిక్సెల్ ఫోల్డ్ ఫోన్‌లో 30W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,821mAh బ్యాటరీ ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, Google Cast, NFC, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఫోన్‌లో ఇచ్చారు. అలాగే యాక్సిలరోమీటర్, బేరోమీటర్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, హాల్ సెన్సార్, లైట్ సెన్సార్ వంటి స్పెసిఫికేషన్స్ కూడా ఫోన్‌లో ఉన్నాయి.  

    ఫోన్‌ స్టోరేజ్‌ 

    పిక్సెల్ ఫోల్డ్ ఫోన్‌ 12 GB RAMతో వర్క్‌ చేయనుంది. ఇంటర్నల్‌ స్టోరేజీ సామర్థ్యం 512 GB వరకూ ఇచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్, ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్, హువావే మేట్ X2 వంటి ఫోల్డబుల్ ఫోన్లకు లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ గట్టి పోటీ ఇవ్వనుంది.

    ధర ఎంతంటే?

    పిక్సెల్ ఫోల్డ్ 256GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర $1,799 (సుమారు రూ.1,47,500) నుంచి ప్రారంభమవుతుంది. 512GB స్టోరేజ్ మోడల్ ధర $1,919 (దాదాపు రూ.1,57,300) వరకు ఉంది. అయితే ప్రస్తుతం ఇది భారత్‌లో అందుబాటులో లేదు. త్వరలోనే అందుబాటులోకి రావొచ్చు. 

    పిక్సెల్‌ వాచ్‌ ఫ్రీ

    ఈ ఫోన్ అబ్సిడియన్, పోర్సిలీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. పిక్సెల్ ఫోల్డ్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ పిక్సెల్ వాచ్‌ను ఉచితంగా అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ యూఎస్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఈ ఫోల్డబుల్ ఫోన్ ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version