హ్యారీ బ్రూక్ సెంచరీ: గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హ్యారీ బ్రూక్ సెంచరీ: గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా!

  హ్యారీ బ్రూక్ సెంచరీ: గర్ల్‌ఫ్రెండ్ చూస్తుండగా!

  April 17, 2023

  Courtesy Twitter: Mufaddal Vohra

  కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నుంచి బయటపడి శతకంతో సత్తాచాటాడు. ఈ సెంచరీని తన గర్ల్‌ఫ్రెండ్ లూసీ లైల్స్ చూస్తుండగా బాదడం విశేషం. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం బ్రూక్ కోల్‌కతా బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగిపోయాడు. కాగా బ్రూక్ రెండేళ్లుగా లూసీతో డేటింగ్ చేస్తున్నాడు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఏమైనా చేస్తారని నెటిజన్లు అంటున్నారు.

  పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇరగదీసిన బ్రూక్‌ను సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ రూ. 13.5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. అయితే, వరుసగా మూడు మ్యాచుల్లోనూ స్వల్ప స్కోరుకే బ్రూక్ ఔటయ్యాడు. అందులో రెండింటిలో 13 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 13.5 కోట్లు పెట్టి కొన్నది.. 13 పరుగులు చేయడానికా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకానొక తరుణంలో బ్రూక్‌ను పక్కన పెడతారని అంతా అనుకున్నారు.

  ఈ క్రమంలోనే సెంచరీతో చెలరేగాడు హ్యారీ బ్రూక్‌. కోల్‌కతా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. విమర్శలను సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పాడు. ఈ మ్యాచ్‌ చూడటానికి అతడి ప్రేయసితో పాటు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బ్రూక్‌….ఇక్కడ నా గర్ల్‌ ఫ్రెండ్‌ ఉంది. సెంచరీ కన్నా ముందు మా కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. నాకు తెలుసు, వాళ్లు వెళ్లాక రన్స్‌ వస్తాయి” అంటూ నవ్వుతూ చెప్పాడు. 

  గర్ల్‌ఫ్రెండ్‌ ఉంటే క్రికెటర్లు చెలరేగి ఆడటం గతంలోనూ చూశాం. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ కూడా తన భార్య మైదానానికి వచ్చినప్పుడు డబుల్ సెంచరీ, సెంచరీలు చేశాడు. అప్పుడు కూడా రోహిత్‌ను ఇలాగే అన్నారు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ కూడా ఇలా ఆడిన సందర్భాలు ఉన్నాయి. మరీ, ప్రేయసి ఉంటే ఆటగాళ్లు మరింత శ్రద్ధగా ఆడతారనే చెప్పాలి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version