HBD Pooja Hegde: ‘జిగేల్‌ రాణి’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Pooja Hegde: ‘జిగేల్‌ రాణి’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా!

    HBD Pooja Hegde: ‘జిగేల్‌ రాణి’ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా!

    October 13, 2023

    యంగ్‌ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

    ప్రస్తుతం ఈ భామ తన పుట్టిన రోజును మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ దిగిన ఓ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘కరెంట్లీ అన్‌అవైలబుల్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది. 

    ఇక పూజా సీక్రెట్స్‌ విషయానికి వస్తే.. ఆమె చాలా మెుండి అట. ఎంతో ఇష్టపడి భరత నాట్యం నేర్చుకుంటానని పూజా అడిగితే వాళ్ల అమ్మ ఒప్పుకోలేదట. దీంతో తండ్రిని పట్టుబట్టి ఒప్పించి తన కలను సాకారం చేసుకుంది ఈ భామ.

    ఈ బ్యూటీ హిందీ (Hindi), ఇంగ్లీషు (English), కన్నడ (Kannada), మరాఠీ (Marathi) అనర్గళంగా మాట్లాడుతుంది. టాలీవుడ్‌ ద్వారా తనకు తెలుగు నేర్చుకునే అవకాశం కూడా లభించిందని పలు ఇంటర్యూల్లో ఈ భామ చెప్పుకొచ్చింది. 

    పూజా హెగ్డేను చిన్నప్పటి నుంచి  అందరూ లక్ష్మీ పూజా అని పిలిచేవారట. ట్రెండీగా లేదని పెద్దయ్యాక ఆమె పూజా అని షార్ట్‌ చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చాక ఆ పేరే కొనసాగుతూ వస్తోంది. 

    ఈ బ్యూటీ చాలా పెద్ద ఫూడీ అట. హైదరాబాదీ బిర్యాని, పిజ్జా లాంటివి తినే ఛాన్స్ వస్తే తనను ఎవరూ ఆపలేరట. ఈ విషయాన్ని పూజ స్వయంగా ఓ ఇంటర్యూలో చెప్పింది. 

    ఈ బ్యూటీకి క్రికెట్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ అంటే చాలా ఇష్టమట. ఆయనకు బిగ్‌ ఫ్యాన్‌ అని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలాగే టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కి కూడా వీరాభిమానని పూజా చెప్పుకొచ్చింది. 

    కొత్త ట్రెండ్స్‌ను అందిపుచ్చుకోవడంలో ఈ భామ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్‌ చేస్తూ స్లైలిష్‌ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది పూజా. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను చూస్తే కొత్త ట్రెండ్స్ చాలానే కనిపిస్తాయి. 

    ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో ఏ యాక్షన్‌ చిత్రంలో నటిస్తోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో పూజాను హీరోగా ఎంపిక చేశారు. 

    ఇక మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్‌గా ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల తన స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఇది పూజా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version