HBD TAPSEE PANNU:  తాప్సీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD TAPSEE PANNU:  తాప్సీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

    HBD TAPSEE PANNU:  తాప్సీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

    August 1, 2022

    తాప్సీ ప‌న్ను ఆగ‌స్ట్ 1, 1987న న్యూఢిల్లీలో జ‌న్మించింది. కంప్యూట‌ర్ సైన్స్‌లో డిగ్రీ చ‌దివిన ఆమె పాకెట్ మనీ కోసం మోడ‌లింగ్‌లో అడుగుపెట్టింది. గార్నియ‌ర్‌, నివియా, కుర్‌కురే, హార్లిక్స్ వంటి ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించింది. అయితే సినిమాల‌పై ఇష్టంతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ల‌లో సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టింది

    కెరీర్‌

    తాప్సీ 2010లో ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఝ‌మ్మంది నాధం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమె చేసిన త‌ర్వాత టాలీవుడ్ లో ఆఫ‌ర్లు వ‌రుస క‌ట్టాయి. త‌ర్వాత‌ త‌మిళంలో ధనుష్‌తో ‘ఆడుకాలం’ అనే సినిమాలో న‌టించింది. ఆ సినిమాకు 6 నేష‌న‌ల్ అవార్డులు రావ‌డం విశేషం. ఆ త‌ర్వాత ఒక‌ మ‌ల‌యాళం సినిమాలో న‌టించింది. ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లిన‌ప్ప‌టికీ తెలుగులో అవ‌కాశాలు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని చెప్తుంది. హిందీ సినిమాలు చేస్తూనే తెలుగులో ఆనందో బ్ర‌హ్మ‌, మిష‌న్ ఇంపాజిబుల్ వంటి చిత్రాల్లో న‌టించింది.

    ప‌రాజ‌యాలు

    ఝుమ్మంది నాదం త‌ర్వాత తెలుగులో ఆమె న‌టించిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ మిన‌హాయించి అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వ‌స్తాడు నారాజు, వీర‌, ద‌రువు, షాడో, గుండెల్లో గోదారి, మొగుడు, మిష‌న్ ఇంపాజిబుల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి.  దీంతో ఆమెకు ఐర‌న్ లెగ్‌గా ముద్ర‌ప‌డింది. కానీ అవేమి ప‌ట్టించుకోని తాప్సీ త‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగించింది. తెలుగులో వ‌రుస సినిమాలు ఒప్పుకున్న ఆమె త‌మిళంలో డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక కొన్ని సినిమాల‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. 

    బాలీవుడ్ ఎంట్రీ

    2013లో తాప్సీ చ‌ష్మే బ‌ద్దూర్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  ఆ త‌ర్వాత బేబీ, ర‌న్నింగ్ షాది, పింక్ వంటి చిత్రాల‌తో బాలీవుడ్‌లో త‌న స్థానం సుస్థిరం చేసుకుంది. బ‌ద్లా, గేమ్ ఓవ‌ర్, మిష‌న్ మంగ‌ళ్, త‌ప్ప‌డ్ వంటి సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. 

    ప్ర‌యోగాలు

    రెగ్యుల‌ర్ సినిమాలు చేయ‌డ‌మే కాకుండా సోలో హీరోయిన్‌గా కొత్త ప్ర‌యోగాలు చేయ‌డం మొలుపెట్టింది తాప్సీ. నామ్ శ‌బానా, ముల్క్‌, గేమ్ ఓవ‌ర్ వంటి చిత్రాలు అలాంటివే.  సాండ్ కీ ఆంఖ్ సినిమాలో 60 ఏళ్ల‌ వృద్ద షార్ప్‌షూట‌ర్ పాత్ర‌లో కనిపించింది. ఇటీవ‌ల మిథాలీ రాజ్ బ‌యోగ్ర‌ఫీగా తెర‌కెక్కిన శ‌భాష్ మిథు సినిమాలో న‌టించింది. 

    తాప్సీ రాబోయే చిత్రాలు

    తాప్సీ వ‌చ్చే రెండేళ్ల పాటు వ‌రుస హిందీ చిత్రాల‌తో బిజీగా ఉంది. బ్ల‌ర్, దొబారా, డుంకీ, త‌డ్కా, హ‌సీనా దిల్‌రుబా 2 వంటి సినిమాల్లో న‌టించ‌నుంది.

    అవార్డులు

    తాప్సీ ఇప్ప‌టివ‌ర‌కు అన్ని భాష‌ల్లో క‌లిపి 14 అవార్డుల‌ను అందుకుంది. అందులో రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా ఉన్నాయి. ఆమె 2018లో ఫోర్బ్స్ ఇండియా 100 సెల‌బ్రిటీల జాబితాలో చోటు సంపాదించుకుంది. 2019, 2020 సంవ‌త్స‌రాలో టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ వుమెన్‌గా నిలిచింది. 

    బిజినెస్ వుమెన్

    ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే తాప్సీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ది వెడ్డింగ్ ఫ్యాక్ట‌రీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌న ప్రారంభించింది. దీని ద్వారా వివాహాలు, ఇత‌ర ఈవెంట్స్ జ‌రిపిస్తారు. తాప్సీ సోద‌రి షాగున్ ప‌న్ను, స్నేహితుడు ఫ‌రా ప‌ర్వేశ్‌తో క‌లిసి ఈ సంస్థ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version