బాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరు. ఆయన రూపొందించిన తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్ (Heeramandi: The Diamond Bazaar) దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సిరీస్‌తోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి డైరెక్టర్ భన్సాలి అడుగు పెడుతున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా (Manisha Koirala), సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), రిచా చద్దా (Richa Chadha), షర్మిన్ సెగల్ (Sharmin Segal), సంజీదా షేక్ (Sanjeeda Sheikh)లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా ట్రైలర్ రిలీజవ్వగా ఇదీ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.
ట్రైలర్‌లో ఏముంది?
హీరామండి ట్రైలర్ పరిశీలిస్తే.. స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్‌లో పరిచయం చేశారు డైరెక్టర్. గతంలో సంజయ్ లీలా భన్సాలీ.. ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో ‘గంగుభాయి కతియావాడి’ (Gangubai Kathiawadi) తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో ‘హీరామండి’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ‘హీరామండీ’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ సిరీస్‌పై బజ్ ఏర్పడింది.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘హీరామండి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. మే 1వ తేదీ నుంచి ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. ఈ సిరీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. 2022లోనే ఈ సిరీస్ షూటింగ్ మొదలైంది. అయితే, షూటింగ్‌లో చోటుచేసుకున్న జాప్యం కారణంగా సిరీస్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సిరీస్ పూర్తై ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉండడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్‍గా టాక్ వస్తే వ్యూయర్‌షిప్‍లో ఈ సిరీస్ రికార్డులను బద్దలుకొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కథేంటి?
ఈ సిరీస్ కథలోకి వెళ్తే.. హీరామండిలో ఓ భారీ వేశ్య గృహాన్ని మల్లికాజాన్ (మనీషా కొయిరాల) నడుపుతుంటుంది. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆమె శాసిస్తుంటుంది. అయితే ఆమె మాజీ శత్రువు కూతురు ఫరీదన్ (సోనాక్షి సిన్హా).. మల్లికాజాన్‍ను దెబ్బకొట్టి హీరామండి హుజూర్ కావాలని ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు దేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతుంటుంది. మల్లికాజాన్ కూతుర్లలో ఒకరైన బిబ్బో జాన్ (అదితి రావ్ హైదరి).. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని పోరాటాలు చేస్తుంది. చిన్నకూతురు ఆలమ్‍జెబ్ (షార్మిన్ సేగల్).. ఓ నవాబు తాజ్‍దార్ (తాహా షా బాదుషా)ను ప్రేమించి.. హీరామండి నిబంధనలను బేఖాతరు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హీరామండిలో ఆధిపత్యం కోసం మల్లికాజాన్, ఫరీదన్ మధ్య ఎలాంటి పోరు జరిగింది? హీరామండి నాయకత్వం చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనేది స్టోరీ.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది