ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్బుతంగా సాగుతోంది. అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు తమకు నచ్చిన వస్తువులను ఆర్డర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మెుబైల్స్, గ్యాడ్జెట్స్, హెడ్‌ఫోన్స్ ఎలక్ట్రానికి వస్తువలపై ఎక్కువ మంది మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గృహోపకరణ వస్తువులపై కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ నడుస్తోంది. వాటిలోని బెస్ట్ డీల్స్ YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Prestige Mixer Grinder
అమెజాన్ పండగ సేల్‌లో ఈ మిక్సర్ గ్రైండర్ సగం ధరకే లభిస్తోంది. 3 స్టెయిన్ లెస్ స్టీల్, 1 జ్యూసర్ జార్లతో రానున్న ఈ మిక్సీ అసలు ధర రూ.6,295. కానీ అమెజాన్ 59% డిస్కౌంట్‌తో రూ.2,599 ఈ మిక్సీని ఆఫర్ చేస్తోంది.
Pigeon Healthifry
అమెజాన్ టాప్ డీల్స్‌లో Pigeon Healthifry కూడా ఉంది. ఇది డిజిటల్ ఫ్రైయర్. ఒక స్పూన్ నూనె మాత్రమే ఉపయోగించి మీకు నచ్చిన వంటకాన్ని ఫ్రై చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.7,995. కానీ, 65% డిస్కౌంట్‌తో అమెజాన్ రూ.2,799 లకే దీన్ని ఆఫర్ చేస్తోంది.
Pigeon Electric Kettle
Pigeon కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కెటెల్ సైతం అమెజాన్ పండగ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీని అసలు ధర రూ.1,245. తాజా సేల్‌లో ఈ కెటెల్‌ను 64% తగ్గింపుతో రూ.444కే పొందవచ్చు. 1.5 లీటర్ల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది.
PHILIPS Air Fryer
PHILIPS కంపెనీకి చెందిన ఏయిర్ ఫ్రైయర్ కూడా అమెజాన్ సేల్‌లో తక్కువకే లభిస్తోంది. ఆయిల్ ఫుడ్‌ను అస్సలు ఇష్టపడని వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వంటకాలను నూనెతో కాకుండా వేడి గాలిని ఉపయోగించి ఉడికిస్తుంది. దీని అసలు ధర రూ.9,995. పండగ సేల్‌లో భాగంగా ఈ ఏయిర్ ఫ్రైయర్ రూ.6,499 అందుబాటులోకి వచ్చింది.
Crompton Water Heater
రాబోయేది చలికాలం. కాబట్టి ఈ అమెజాన్ సేల్‌లో మంచి వాటర్ హీటర్‌ను కొనుగోలు చేయడం బెటర్. ఈ పండగ సేల్‌లో Crompton Water Heater భారీ రాయితీతో లభిస్తోంది. రూ.7,299 విలువ కలిగిన ఈ వాటర్ హీటర్‌ను 59% డిస్కౌంట్‌తో రూ.2,998కే పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది.
Samsung 28L Microwave
అమెజాన్‌లో శాంసంగ్ మైక్రోవేవ్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. రూ.16,990 విలువైన Samsung 28L మైక్రోవేవ్‌ను రూ.11,990 పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. దీనికి 28 లీటర్ల సామర్థ్యం ఉండటం వల్ల పెద్ద ఫ్యామిలీలు కూడా వియోగించవచ్చు. ఈ మైక్రోవేవ్ చైల్డ్ లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది. కాబట్టి ఇంట్లోని పిల్లలు ఏమరుపాటుగా దీన్ని తెరిచిన చైల్డ్ లాక్ వల్ల అది ఓపెన్ కాదు.
Crompton Arno Water Heater
Crompton కంపెనీకి చెందిన మరో వాటర్ హీటర్ కూడా అమెజాన్ తక్కువ ధరకే సేల్‌కు వచ్చింది. రూ.10,000 ఖరీదు గల Crompton Arno Water Heaterను 30% డిస్కౌంట్‌తో రూ.6,999లకు దక్కించుకోవచ్చు. ఇది 25 లీటర్ల వాటర్ కెపాసిటీని కలిగి ఉంది. ఇందులో అడ్వాన్స్ లెవెల్ భద్రతను ఉపయోగించారు.
LG 32 L Microwave Oven
LG కంపెనీకి చెందిన మైక్రోవేవ్ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి సమయం. LG 32 L Convection Microwave తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో 211 ఇండియన్ ఆటో కుక్ మెనూ ఆప్షన్స్ (211 Indian auto cook menu options), ఆహారాన్ని పులియబెట్టే ఫీచర్ కూడా ఉంది.
IFB 24 L Solo Microwave Oven
24 లీటర్ల సామర్థ్యంతో ఈ మైక్రోవేవ్ ఒవెన్‌ను తీసుకొచ్చారు. ఇది బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్, డిఫ్రోస్టింగ్, కుకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మైక్రోవేవ్ చైల్డ్ లాక్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కాబట్టి దీని నుంచి చిన్నారులకు రక్షణ లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఈ మైక్రోవేవ్‌పై భారీ డిస్కౌంట్ నడుస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!