హానర్ కంపెనీ నంచి భారత్ మార్కెట్‌లోకి కొత్త మొబైల్ లాంచ్ కానుంది. Honor 200 Lite పేరుతో ఈ నెలలో విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన Honor 200, Honor 200 Pro తర్వాత ఆ లైన్‌అప్‌లో మూడవ స్మార్ట్‌ఫోన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించబడనుంది.
Honor 200 Lite ఇప్పటికే యూరోప్‌లో ఆవిష్కరించబడింది. అంతేకాకుండా, Honor 200 Liteకి సంబంధించిన వివరాలు అమెజాన్‌లో లైవ్ అయ్యాయి. దీనిలో డివైస్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ ధృవీకరించింది.
Honor 200 Lite లాంచ్ డేట్
Honor 200 Lite భారతదేశంలో సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ తర్వాత, Honor 200 Lite అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.
కలర్స్
Honor 200 లైట్ స్మార్ట్ ఫోన్, Cyan Lake, Midnight Black, Starry Blue కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్ సైట్ ప్రకారం Honor 200 Lite, యూరోప్‌లో విడుదలైన మోడల్‌తో ఒకే విధమైన కెమెరా, డిస్‌ప్లే స్పెసిఫికేషన్లను కలిగి ఉండనుంది.
Honor 200 Lite స్పెసిఫికేషన్స్
కెమెరా
అమెజాన్ ప్రకారం, Honor 200 Liteలో f/1.75 అపర్చర్‌తో 108MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఈ ప్రధాన కెమెరా, f/2.4 అపర్చర్‌తో 2MP మాక్రో యూనిట్, 5MP అల్ట్రావైడ్/డెప్త్ షూటర్‌తో జత చేయబడింది. ముందు వైపున, Honor 200 Liteలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరా AI వైడ్ యాంగిల్ సెల్ఫీ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఫలితంగా లో లైట్‌లో కూడా నాణ్యమైన ఫోటోలు తీయవచ్చు.
డిస్‌ప్లే
Honor 200 Liteలో 3240Hz PWM డిమ్మింగ్‌తో AMOLED డిస్‌ప్లే ఉండనుంది. స్క్రీన్ FHD+ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.78mm థిక్‌నెస్, 166 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
Honor 200 Lite, Android 14 ఆధారిత MagicOS 8.0పై పని చేస్తుంది. ఈ గ్యాడ్జెట్ SGS 5 స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కలిగి ఉండటం వల్ల హ్యాండ్‌సెట్ చేజారి కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
Honor 200 Lite ప్రాసెసర్ & బ్యాటరీ
MediaTek Dimensity 6080 SoC ప్రాసెసర్ రానుంది. ఈ ఫోన్ 4,500 mAh బ్యాటరీతో 30W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది
ధర
Honor 200 Lite ధర సుమారు రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండవచ్చని అంచనా. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్‌లో SBI కార్డుల మీద అదనంగా 10% క్యాష్ బ్యాక్ లభించనుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?