ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ హానర్ (Honor) మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Honor 90 GT’ పేరుతో అడ్వాన్స్‌డ్ మెుబైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మేలో వచ్చిన ‘Honor 80 GT’ స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ‘హానర్ 90 జీటీ’ సమాచారం లీకైంది. మెుబైల్‌లోని కీలక ఫీచర్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్కీన్
హానర్ 90 GT స్మార్ట్‌ఫోన్.. 6.68 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ డిస్‌ప్లేకు 1080 x 2400 పిక్సెల్స్ క్వాలిటీని అందిస్తారని తెలిసింది. 4000 nit బ్రైట్‌నెస్‌తో పాటు 144 రిఫ్రెష్ రేట్ కలిగిన పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఫోన్ రాబోతుంది. ఈ మెుబైల్ Android v14 OS, Qualcomm Snapdragon 8 Gen3 Chipsetతో పని చేస్తుందని సమాచారం.
కెమెరా క్వాలిటీ
ఈ ఫోన్‌కు అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందిస్తున్నట్లు తెలిసింది. మెుబైల్ వెనుక భాగంలో 100 MP + 8 MP + 2 MP ట్రిపుల్ రియర్ కెమెరాలను ఫిక్స్ చేస్తారట. ఇవి 4K @ 30 fps UHD వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయట. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 32 MP కెమెరాను ఫిక్స్ చేస్తారని లీకైన సమాచారం చెబుతోంది.
బ్యాటరీ సామర్థ్యం
హానర్ 90 జీటీ మెుబైల్‌కు 4800mAh బ్యాటరీని అమరుస్తారని తెలుస్తోంది. ఇది ఏకంగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. అలాగే 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఫోన్‌కు అందిస్తారని అంటున్నారు.
ర్యామ్ & స్టోరేజ్
ఈ ఫోన్ పలు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఓ వేరియంట్ గురించి ఆన్‌లైన్‌లో సమాచారం లీకైంది. 12 GB RAM / 256 GB స్టోరేజ్‌తో ఆ వేరియంట్ వస్తున్నట్లు తెలిసింది.
కనెక్టివిటీ ఫీచర్లు
ఇతర మెుబైల్స్ లాగానే ఇందులోనూ కీలకమైన కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. 5G, 4G VoLTE Bluetooth v5.4, WiFi, NFC, USB-C v2.0తో పాటు వివిధ రకాలైన సెన్సార్ ఫీచర్లతో మెుబైల్ లాంచ్ కానుంది.
ధర ఎంతంటే?
Honor 90 GT మెుబైల్ ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను కంపెనీ చేయలేదు. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 43,990 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది.