Honor X50i+ : హానర్ నుంచి మీడియం బడ్జెట్‌లో మరో కొత్త ఫోన్.. ధర, ప్రత్యేకతలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Honor X50i+ : హానర్ నుంచి మీడియం బడ్జెట్‌లో మరో కొత్త ఫోన్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    Honor X50i+ : హానర్ నుంచి మీడియం బడ్జెట్‌లో మరో కొత్త ఫోన్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    November 12, 2023

    ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ హానర్ నుంచి మరో మొబైల్ లాంచ్ అయింది. Honor X50i+ అనే పేరుతో చైనా మార్కెట్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ Honor X50i లైనప్‌లో వచ్చిన లెటెస్ట్ ఎడిషన్ ఫోన్. హానర్  X50i  ఏప్రిల్‌లో లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. కాగా Honor X50i+… MediaTek డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో 4,500mAh బ్యాటరీని ప్యాక్‌తో వచ్చింది. 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరి ఈ ఫోన్ ధర, ఇతర ప్రత్యేకతలపై ఓ లుక్ వేయండి.

    Honor X50i+ డిస్‌ప్లే

    ఈ గ్యాడ్జెట్ 6.7 అంగుళాల పోడవుతో సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చింది. 2412*1080 పిక్సెల్ స్క్రీన్ రెజల్యూషన్‌తో 90Hz రీఫ్రేష్ రేటును కలిగి ఉంది.  2000nits పీక్ బ్రైట్ నెస్‌ను అందించారు. ఫోన్‌ బరువు 166 గ్రాములు కాగా పరిమాణం 161.05mm x 74.55mm x 6.78mm.

    కెమెరా

    ఈ మొబైల్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వచ్చింది.  దీని ప్రధాన కెమెరా f/1.75 ఎపర్చర్‌తో 108-మెగాపిక్సెల్‌తో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీస్తుంది. సర్కిల్ షెప్‌లో LED ఫ్లాష్ యూనిట్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌తో వచ్చింది. ఇది డిస్‌ప్లే పైభాగంలో సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో సెట్ చేయబడింది.

    ప్రాసెసర్

    ఈ గ్యాడ్జెట్లో పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు.  MediaTek డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్ ద్వారా Android 13-ఆధారిత MagicOS 7.2 పై రన్ అవుతుంది.  12GB RAM సపోర్ట్‌తో 512GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    బ్యాటరీ 

    హానర్  X50i+ బిగ్ బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులో ఉంది. 4500mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. 35W ఫాస్ట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

    కలర్స్

    హానర్  X50i+ ప్రస్తుతం నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫోన్ క్లౌడ్ వాటర్ బ్లూ, ఫాంటసీ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, లిక్విడ్ పింక్ కలర్‌వేస్‌ అట్రాక్ట్ చేస్తోంది. ఇంక్ జెడ్ గ్రీన్ మరింత ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

    కనెక్టివిటీ

    Honor X50i+ స్మార్ట్ ఫోన్.. అన్ని కనెక్టీవిటీలను సపోర్ట్ చేస్తుంది. 5G,  బ్లూటూత్ v5.1, OTG, GPS, AGPS, క్లోనాస్, బీడౌ, గెలీలియో, USB టైప్-సి కనెక్టివిటీకి కూడా మద్దతు ఇస్తుంది.  సెక్యురిటీ పర్పస్‌లో ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 

    ధర

    Honor X50i+  బెస్ మోడల్‌ 12GB RAM + 256GB స్టోరేజ్ కెపాసిటీతో లాంచ్ అయింది. ఈ ప్రైమరీ మోడల్ ధర చైనాలో CNY 1,599 కాగా భారత్‌లో సుమారు రూ. 18,600గా ఉండనుంది. అయితే 12GB RAM + 512GB ప్రీమియం మోడల్ ధర మాత్రం ఇండియాలో సుమారు రూ. 20,900గా ఉండనుంది.

    ఎప్పుడు అందుబాటులోకి..

    ప్రస్తుతం ఈ ఫోన్‌ను చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. ఇండియాలో లాంచింగ్ చేసే తేదీపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version