Horror Novels for Beginners: వెన్నులో వణుకు పుట్టించే టాప్ 20 హర్రర్ నవలలు, చదివే ధైర్యం ఉందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Horror Novels for Beginners: వెన్నులో వణుకు పుట్టించే టాప్ 20 హర్రర్ నవలలు, చదివే ధైర్యం ఉందా?

    Horror Novels for Beginners: వెన్నులో వణుకు పుట్టించే టాప్ 20 హర్రర్ నవలలు, చదివే ధైర్యం ఉందా?

    November 5, 2024

    హర్రర్ స్టోరీలను చదవడం ఒక థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. కొందరికి ఈ ప్రక్రియ అలవాటుగా ఉంటుంది. అయితే కొత్తగా హర్రర్ నవలలు చదవాలనుకునే వారు సులభమైన, ఆసక్తికరమైన కథలతో మొదలుపెట్టడం మంచిది. ఈ కథనంలో, ఆంగ్ల భాషలోని టాప్  20 హారర్ నవలలను పరిచయం చేస్తూ వాటి ప్రత్యేకతలను వివరిస్తున్నాం. ఆ కథలు చదివి మీరు థ్రిల్ ఫీల్ అవ్వండి. ఈ నవలలు అన్నీ Amazonలో అందుబాటులో ఉన్నాయి.

    1. Dracula – Bram Stoker

    • ప్రాముఖ్యత: డ్రాకులా అనే ప్రముఖ వాంపైర్‌ పాత్రకు ఈ నవల ద్వారా జీవం పోశారు. హారర్ కథనాలు ఇష్టపడే పాఠకులకు మరింత థ్రిల్‌కు గురిచేస్తుంది.
    • కథాంశం: జోనాథన్ హార్కర్ అనే యువకుడు ట్రాన్సిల్వేనియాలోని డ్రాకులా కౌంట్ తో తన ప్రయాణం మొదలుపెడతాడు, కాని అతను అక్కడ భయంకరమైన  పరిస్థితులను ఎదుర్కొంటాడు.

    2. Frankenstein – Mary Shelley

    • ప్రాముఖ్యత: Frankenstein అనేది మానవ సృష్టి, ప్రకృతికి సంబంధించిన అనేక  సంక్లిష్టమైన అంశాలను స్పృశించే కథ. ఇది చాలా సింపుల్ ఇంగ్లిష్‌లో బిగినర్స్‌కు ఇట్టే అర్థం అవుతుంది.
    • కథాంశం: డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ తన ప్రయోగం ద్వారా మనిషిని సృష్టిస్తాడు, కానీ ఆ సృష్టి అతడికి వ్యతిరేకంగా మారుతుంది. ఇంకా కథలో అనేక ట్విస్ట్‌లు ఉంటాయి.

    3. The Haunting of Hill House – Shirley Jackson

    • ప్రాముఖ్యత: ఇప్పటి వరకు వచ్చిన భూత్ బంగ్లా కథల్లో అత్యంత భయానకంగా భావించబడే నవల.
    • కథాంశం: హిల్ హౌస్‌ లో నివసించే ఓ కుటుంబం దెయ్యాల వల్ల ఎలాంటి విపరీత పరిస్థులను ఎదుర్కొన్నది అనేది సారాంశం.

    4. Pet Sematary – Stephen King

    • ప్రాముఖ్యత: మరణం, కుటుంబ సంబంధాలను ఎలా భయానకంగా చూపించగలిగారో ఈ నవల ద్వారా తెలుస్తుంది.
    • కథాంశం: ఓ కుటుంబం ఓ పాత సమాధిలోని రహస్యాలను తెలుసుకుంటుంది. దీని మూలంగా భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    5. The Shining – Stephen King

    • ప్రాముఖ్యత: మానసిక పరిస్థితి, భయం, కుటుంబ సంబంధాల మధ్య నరకాన్ని చూపించే విధంగా రాయబడింది.
    • కథాంశం: ఓవర్‌లుక్ హోటల్ లోని ప్రేతాత్మల ప్రభావం అనుభవించే జాక్ అనే వ్యక్తి.

    6. Coraline – Neil Gaiman

    • ప్రాముఖ్యత: పిల్లలకు అనువైన హారర్ కథగా భావించబడే ఈ నవల భయానక ప్రపంచాన్ని అనుభవింపజేస్తుంది.
    • కథాంశం: కొరలైన్ అనే చిన్నారి మరో ప్రపంచంలో అడుగుపెడుతుంది, అక్కడ భయానక పరిస్థితులను ఎదుర్కొంటుంది.

    7. The Exorcist – William Peter Blatty

    • ప్రాముఖ్యత: ఈ నవల భూతం పట్టిన కథలకు ప్రాథమిక నిదర్శనం.
    • కథాంశం: ఓ చిన్నారికి భూతం పట్టినప్పుడు ఆమెను రక్షించేందుకు  ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది అనేది కథనం.

    8. Salem’s Lot – Stephen King

    • ప్రాముఖ్యత: చిన్న గ్రామంలో భూతాలు, వాంపైర్ ఎక్కవ అవుతాయి. ఇది పాఠకులకు ఒక మంచి థ్రిల్‌ను అందిస్తుంది.
    • కథాంశం: విల్లేజ్‌లోకి వచ్చిన వాంపైర్ తన ప్రభావాన్ని గ్రామ ప్రజలపై చూపిస్తుంది. ఆ తర్వాత ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అనేది ప్రాథమిక కథాంశం.

    9. The Woman in Black – Susan Hill

    • ప్రాముఖ్యత: ఈ నవల క్లాసిక్ హారర్ కథాంశంలో ఉన్నట్లు భూతాలు, ప్రమాదాలతో కూడినది.
    • కథాంశం: ఓ లాయర్ తన గతం గురించి భయానక రహస్యాలను తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథాంశం

    10. Bird Box – Josh Malerman

    • ప్రాముఖ్యత: ఈ కథ భయం ఎలా మనిషిని మనసునే కాకుండా శరీరాన్నీ ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.
    • కథాంశం: ఎవరూ చూడకుండా జీవించే ఒక ప్రపంచంలో కుటుంబం తమ ప్రాణాలను రక్షించుకోవడానికి చేసిన ప్రయాణం.

    11. World War Z – Max Brooks

    • ప్రాముఖ్యత: ఈ నవల జాంబీ apocalypse గురించి అనేక విషయాలను వివరిస్తుంది. భయం, దయనీయత, సాహసం, మరియు మానవ సంబంధాలను ఈ కథలో స్పష్టంగా చూపిస్తారు.
    • కథాంశం: ఈ కథ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన జాంబీ సంక్షోభం యొక్క అనుభవాలను పాఠకులకు వివరిస్తుంది. వివిధ దేశాల ప్రజలు తమ ప్రాంతాల్లో జాంబీలతో ఎలా పోరాడారో, ఆ భయానక అనుభవాలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకోవచ్చు.

    12. The Silence of the Lambs – Thomas Harris

    • ప్రాముఖ్యత: సీరియల్ కిల్లర్ హన్నిబల్ లెక్టర్ పాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇది మానవ స్వభావంలోని చీకటి మూలాలను అన్వేషిస్తుంది.
    • కథాంశం: FBI ఏజెంట్ క్లారిస్ స్టార్లింగ్, సీరియల్ కిల్లర్ బఫెలో బిల్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. హన్నిబల్ లెక్టర్ అనే ఖైదీని సలహా కోసం సంప్రదిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నది కథ.

    13. The Turn of the Screw – Henry James

    • ప్రాముఖ్యత: మానసిక సంఘర్షణల మధ్య భయానక పరిస్థితులను అనుభవించేందుకు సరైన పుస్తకం ఇది.
    • కథాంశం: ఒక గవర్నెస్ ఇద్దరు చిన్నారులను చూసుకోవడం కోసం గ్రామీణ ప్రదేశానికి వెళ్తుంది. కానీ, అక్కడ భయంకరమైన ప్రేతాత్మలు ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. ఇది ఆమె మనసుకు భయానక అనుభవాన్ని కలిగిస్తుంది.

    14. Ghost Story – Peter Straub

    • ప్రాముఖ్యత: ఈ నవల ఒక గ్రామంలో దెయ్యాల ప్రభావంతో అనేక సంఘటనలు ఎలా జరుగుతాయో, భూతాల కథలు పంచుకోవడం ఒక సంప్రదాయంగా ఎలా మారుతుందో వివరిస్తుంది.
    • కథాంశం: కొన్ని సంవత్సరాల తరువాత, కొందరు మిత్రులు వారి చిన్నప్పటి భయానక అనుభవాలను పంచుకుంటారు. వారి చుట్టూ ఉన్న దుష్టశక్తులు వారి జీవితాలను ప్రభావితం చేయడం మొదలవుతుంది.

    15. The Ruins – Scott Smith

    • ప్రాముఖ్యత: ఈ నవల మనం సాధారణంగా కల్పించలేని భయానక పరిణామాలను మన ముందుకు తెస్తుంది. ఇది ప్రకృతి మరియు భయంకర జీవుల మీద ఆధారపడి ఉంటుంది.
    • కథాంశం: ఓ పర్యాటక గుంపు మెక్సికో అడవులలో ప్రాచీన అవశేషాలను పరిశీలించడానికి వెళ్తుంది. అయితే అక్కడ వారు విచిత్ర జీవుల మధ్య చిక్కుకుంటారు.

    16. I Am Legend – Richard Matheson

    • ప్రాముఖ్యత: భవిష్యత్ లో మనిషి ఏకాంత జీవితాన్ని ఎలా గడుపుతాడో ఈ నవలలో స్పష్టంగా చూపిస్తుంది. హారర్ పాఠకులకు ఈ పుస్తకం చాలా బాగా నచ్చుతుంది.
    • కథాంశం: ప్రపంచంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే సాధారణ మనిషిగా మిగిలిపోతాడు, మిగతా అందరూ రాత్రి సమయంలో హింసాత్మక రాక్షసులుగా మారతారు. అతను తన ప్రాణాలు కాపాడుకోవడానికి  ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది కథ.

    17. House of Leaves – Mark Z. Danielewski

    • ప్రాముఖ్యత: ఇది ఒక విభిన్నమైన కథా శైలి ద్వారా చెప్పబడింది, ఇందులో కథానాయకులు అనేక మానసిక, భౌతిక భయాలను అనుభవిస్తారు.
    • కథాంశం: ఒక కుటుంబం తమ కొత్త ఇంట్లో ప్రవేశించిన తర్వాత, ఇల్లు ఇరుకైన గదులతో కూడిన ఒక వింత ప్రపంచంలోకి మారుతుంది. వారికి ప్రతి మూలకు వెళ్ళినప్పుడు గమ్మత్తైన భయాలు ఎదురవుతాయి.

    18. Doctor Sleep – Stephen King

    • ప్రాముఖ్యత: “The Shining” నవలకి ఇది కొనసాగింపు కథ. ఈ కథ దాని పాత్రలకు మరింత లోతును ఇస్తుంది, మరియు మానవ మనసును ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.
    • కథాంశం: డానీ టోరెన్స్, చిన్నప్పుడు హోటల్‌లో ఎదుర్కొన్న అనుభవాల తర్వాత పెద్దవాడవుతాడు. అతను తన జీవితంలో కొత్త అతీత శక్తులు కలిగిన వ్యక్తులను కలుస్తాడు.

    19. Carrie – Stephen King

    • ప్రాముఖ్యత: సూపర్‌నాచురల్ థీమ్ తో కూడిన ఈ కథ ప్రతీకారానికి,  చీకటి భావోద్వేగాలకు నిలయంగా ఉంటుంది.
    • కథాంశం: క్యారీ అనే యువతీ తన స్నేహితులచే హింసకు గురైన తర్వాత వారిపై ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఇందులో ఆమె సైకిక శక్తులు ఈ కథలో కీలకమైనవి.

    20. The Amityville Horror – Jay Anson

    • ప్రాముఖ్యత: వాస్తవ ఘటనల ఆధారంగా రాయబడిన ఈ నవల భయాన్ని ఎంతో తీవ్రతతో చూపిస్తుంది.
    • కథాంశం: ఓ కుటుంబం కొత్త ఇంట్లో ప్రవేశించిన తర్వాత, అక్కడ అనుభవించే భయానక సంఘటనలు వారి జీవితాన్ని మార్చేస్తాయి. ఇది ఆ ఇంటిలో గతంలో జరిగిన హత్యల వలన వచ్చిన ప్రేతాత్మల ప్రభావంగా భావిస్తారు.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version