ఆరెంజ్ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరెంజ్ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

    ఆరెంజ్ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

    April 18, 2023

    Courtesy Twitter: Indian Box Office

    మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, జెనీలియా జంటగా నటించిన ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌లోనూ దుమ్మురేపింది. ఈ చిత్రం రీ రిలీజ్‌కు ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమా 3 రోజుల్లో 2.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రీ రిలీజ్ అయిన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఈ మూవీ టాప్ 5లో చోటు నిలిచింది. ‘ఆరెంజ్’ సినిమా 2010లో విడుదలైంది. ఈ మూవీలో నాగబాబు, ప్రకాశ్ రాజ్, షాజాన్ పదామ్సీ, సంచిత శెట్టి, వెన్నెల కిశోర్‌లు కీలకపాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు.

    2010లో ఆరెంజ్‌(Orange) సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజైంది. బొమ్మరిల్లు బాస్కర్‌ దర్శకత్వంలో మెగా బ్రదర్‌ నాగబాబు(Naga Babu) రూపొందించిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికే సినిమా పాటలు సూపర్‌ హిట్‌ కావడంతో ఆరెంజ్‌ కూడా అదే రేంజ్‌లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంటుందని నాగబాబు సహా చిత్ర యూనిట్ అంతా భావించింది. కానీ, విడుదల తర్వాత ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆరెంజ్‌ కంటెంట్ ఇప్పటి జనరేషన్స్‌కి బాగా కనెక్ట్ కావడంతో ఆరెంజ్ సినిమాకు మంచి ప్రశంసలే వచ్చాయి.

    ఇటీవల వరుసగా స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరారు. దీంతో నాగబాబు ఆరెంజ్ సినిమాని చరణ్‌ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌ స్పందన బాగా రావడంతో  ఒక రోజు మాత్రమే అనుకున్న రీ రిలీజ్‌ను మూడు రోజులు నడిపించారు. దీంతో ఈ సినిమా 3 రోజుల్లో 2.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

    కాగా, ఇటీవల నాగబాబు ఆరెంజ్ రీ రిలీజ్ సక్సెస్ పై మాట్లాడారు. అప్పుడు రిలీజ్ చేసినప్పుడు సినిమా ఫ్లాప్ అయిందని ఇప్పుడు సూపర్‌ హిట్ అంటున్నారని చెప్పారు. ఆరెంజ్‌ను ఇప్పుడు రిలీజ్ చేసుంటే తాను అప్పులపాలయ్యేవాడిని కాదేమో నాగబాబు చమత్కరించారు. అయితే ఆరెంజ్‌ రీరిలీజ్‌కు వచ్చిన కలెక్షన్స్‌ను జనసేన పార్టీకి అందజేస్తానని గతంలోనే నాగబాబు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా జనసేన పార్టీకి ఆ ఫండ్‌ను ఇవ్వనున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version