న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..

    న్యూజిలాండ్‌తో పోరు కీలకమెందుకంటే..

    November 16, 2021
    in Cricket

    New Zealand, Feb 08 (ANI): Indian skipper Virat Kohli shakes hand with New Zealand's Kane Williamson during the 2nd ODI between India and New Zealand at Eden Park in Auckland on Saturday. (ANI Photo)

    టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ను ఓటమితో మొదలు పెట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం పొందింది. అదే సమయంలో మన గ్రూపులో ఉన్న మరో స్ట్రాంగ్ కెంటెండర్ అయిన న్యూజిలాండ్ కూడా పాక్ మీద తన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అక్టోబర్ 31 ఆదివారం దుబాయ్ వేదికగా ఈ రెండు జట్లు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరులో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుకు సెమీస్ చేరడం చాలా క్లిష్టమవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

    1. ఒక వేళ ఇండియా గెలిస్తే..

    ఈ ప్రతిష్టాత్మక పోరులో న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచిందని అనుకుందాం. అప్పుడు ఇండియాకు రెండు పాయింట్లు యాడ్ అవుతాయి. తదుపరి మెన్ బ్లూ తమ మ్యాచ్‌లను పసికూనలుగా భావించే స్కాట్లాండ్, నమీబియా, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ వంటి జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచుల్లో గెలవడం టీమిండియాకు పెద్ద కష్టం కాదు కావున ఈ మ్యాచులన్నింటిలో గెలిస్తే ఇండియా ఖాతాలో అప్పుడు 10 పాయింట్లు జమవుతాయి. ఒక వేళ పాకిస్తాన్ అన్ని మ్యాచులు గెలిచి 12 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరినా ఇండియా 10 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుని దర్జాగా సెమీస్ గడప తొక్కుతుంది. 

    1. ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే..  

    ఈ ప్రతిష్టాత్మక పోరులో ఒక వేళ ఇండియా మీద న్యూజిలాండ్ జట్టు గెలిస్తే ఇండియాకు సెమీస్ దారులు సంక్లిష్టమవుతాయి. ఒక వేళ ఇండియా నమీబియా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ వంటి జట్ల మీద గెలిచినా కానీ కేవలం 8 పాయింట్లే వస్తాయి. అప్పుడు ఇండియా సెమీస్ చేరే అవకాశాలు న్యూజిలాండ్ జట్టు గెలుపోటముల మీద ఆధారపడి ఉంటాయి. 

    1. న్యూజిలాండ్ మీద గెలిచినా కానీ.. 

    టీమిండియా బ్లాక్ క్యాప్స్‌ మీద గెలిచి మిగతా జట్ల మీద ఓడిపోయినా కానీ ఇండియాకు సెమీస్ అవకాశం అంత ఈజీగా లభించదు. న్యూజిలాండ్ గెలుపోటములను మనం చూస్తూ ఉండాలి. 

    1. అఫ్ఘన్‌ను తక్కువ అంచనా వేయలేం.. 

    అఫ్ఘనిస్తాన్ జట్టును మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే స్పిన్ ప్రభావిత పిచ్‌ల మీద రషీద్ ఖాన్, ముజీబ్, నబీ వంటి ఆటగాళ్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. 

    1. నెట్ రన్‌రేట్ కూడా.. 

    టీమిండియాను కలవరపెడుతున్న మరో అంశం నెట్ రన్‌రేట్. ఎవరూ పెద్దగా పట్టించుకోని NRR క్రూషియల్ రోల్ పోషించనుంది. పాక్ మీద ఇండియా పది వికెట్ల తేడాతో ఓడిపోవడంతో NRR -0.973కి పడిపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్ కేవలం ఐదు వికెట్ల తేడాతో మాత్రమే ఓడిపోయి మనకంటే మెరుగైన స్థితిలో (-0.532) ఉంది. అఫ్ఘనిస్తాన్ కూడా పసికూన స్కాట్లాండ్‌ను తమ స్పిన్‌తో మాయ చేసి 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అఫ్ఘన్‌కు +6.500 NRR ఉండడం విశేషం. 

    ఈ సమీకరణాలు అన్నింటిని పరిశీలిస్తే టీమిండియా న్యూజిలాండ్ మీద గెలవడమే శరణ్యంలా కనిపిస్తోంది. 

    ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే.. గమనించగలరు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version