Indian Richest Actress: దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే? దీపికా, ఐశ్వర్యరాయ్, అలియా మాత్రం కాదు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Indian Richest Actress: దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే? దీపికా, ఐశ్వర్యరాయ్, అలియా మాత్రం కాదు!

    Indian Richest Actress: దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరంటే? దీపికా, ఐశ్వర్యరాయ్, అలియా మాత్రం కాదు!

    October 22, 2024

    దేశంలో అత్యధిక సంపాదకులు అనగానే ప్రతీ ఒక్కరు అంబానీ, ఆదానీ పేర్లు ఠక్కున చెప్పేస్తారు. ధనిక హీరోల గురించి అడిగిన కూడా సినిమా నాలెడ్జ్‌ ఉన్నవారు ఆలోచించకుండా ఆన్సర్  చెప్పగలుగుతారు. మరి రిచెస్ట్‌ హీరోయిన్స్ అంటే మాత్రం సినీ లవర్స్‌తో సహా ఎవరి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. హీరోయిన్ల ఆస్తులు, రెమ్యూనరేషన్స్ గురించి ఎక్కువగా చర్చ జరగకపోవడమే ఇందుకు కారణం. ఇది గమనించిన హురున్‌ రిచ్‌ లిస్ట్‌ సర్వే (Hurun India Rich List) సంస్థ దేశంలోనే అత్యంత సంపన్నురాలైన హీరోయిన్ల జాబితాను రిలీజ్‌ చేసింది. టాప్‌-5లో ఉన్న నటీమణుల ఆస్తుల విలువను ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    జుహీ చావ్లా (Juhi Chawla)

    హురున్‌ రిచ్‌ లిస్ట్‌ సర్వే ప్రకారం దేశంలో అత్యంత ధనవంతురాలైన నటిగా బాలీవుడ్‌ తార జుహీ చావ్లా (Juhi Chawla) నిలిచింది. ఐశ్వర్యరాయ్‌, ప్రియాంక చోప్రా, అలియా భట్‌, దీపికా పదుకొనే వంటి స్టార్‌ హీరోయన్లను తలదన్ని ఎవరూ ఊహించని విధంగా టాప్‌ ప్లేస్ దక్కించుకుంది. ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.4,600 కోట్ల రూపాయలు ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. 1990వ దశకంలో జుహీ చావ్లా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 1984లో మిస్‌ ఇండియా కిరిటాన్ని సైతం కైవసం చేసుకుంది. వయసు రిత్యా హీరోయిన్‌ పాత్రలకు స్వస్థి పలికిన జుహీ గత పదేళ్లుగా అడపాదడపా సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే జుహి చావ్లాకు సినిమాలతో పాటు చాలా వ్యాపారాలు ఉన్నాయి. షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కోలకత్తా నైట్‌ రైడర్స్‌లో ఆమెకు భాగస్వామ్యం ఉంది. అలాగే ఆమె భర్త జై మెహతా పెద్ద వ్యాపారవేత్త. కుటుంబ వ్యాపారాల్లోనూ జుహీ చావ్లాకు భాగస్వామ్యం ఉంది. 

    ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai)

    దేశంలోని ధనిక హీరోయిన్ల జాబితాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె ఆస్తుల విలువ రూ.860 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ తేల్చింది. ఈమె సంపద చాలా మంది హీరోల కన్నా ఎక్కువనే చెప్పాలి. ఐశ్వర్య ఇటీవల కాలంలో హీరోయిన్‌గా కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రం కోసం రూ.15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక ఏదైనా బ్రాండ్‌కు పనిచేస్తే రోజుకు రూ.6-7కోట్లు చార్జ్‌ చేస్తున్నట్లు టాక్ ఉంది. ప్రస్తుతం పలు అంతర్జాతీయ బ్రాండ్‌లకు ఆమె పనిచేస్తోంది. వీటితో పాటు దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ ఇంటికి కోడలిగా వెళ్లి తన గుడ్‌విల్‌ను, మార్కెట్‌ వాల్యూను మరింత పెంచుకుంది. 

    ప్రియాంక చోప్రా (Priyanka Chopra)

    బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకుంది. ఆమె రూ.650 కోట్ల మేర ఆస్తులను కూడబెట్టినట్లు హురున్‌ రిచ్‌ లిస్ట్‌ సర్వే సంస్థ ప్రకటించింది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యింది. అక్కడ వరుసగా సినిమాలు, ‘సిటాడెల్‌’ వంటి సిరీస్‌లు చేసి భారీ మెుత్తంలో రెమ్యూనరేషన్‌ అందుకుంటోంది. అలాగే నిర్మాణ సంస్థ పర్పుల్‌ పిక్చర్స్‌ పార్ట్నర్స్‌ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తోంది. ప్రసిద్ధ డేటింగ్‌ యాప్‌ ‘బుంబుల్‌’లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే హెయిర్‌ కేర్‌ కంపెనీ ‘అనామలీ’ని కూడా ఆమె ఇటీవల ప్రారంభించింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా ప్రియాంక సంపాదిస్తోంది.

    అలియా భట్‌ (Alia Bhatt)

    బాలీవుడ్‌ స్టార్ బ్యూటీ అలియా భట్‌ రూ.550 కోట్ల ఆస్తులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు పైనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార సామ్రాజ్యంలోనూ ఈ అమ్మడు సత్తా చాటుతోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma) అనే స్టార్టప్ కంపెనీని లాంచ్‌ చేసింది. ఈ కంపెనీ 2 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన బట్టలను విక్రయిస్తుంటుంది. వెబ్‌సైట్ ద్వారా 800లకుపైగా ప్రొడక్స్ట్ ఈ కంపెనీ విక్రయిస్తోంది. 12 నెలల్లోనే 10 రెట్ల వృద్ధితో రూ.150 కోట్లు విలువైన సంస్థగా అవతరించడం గమనార్హం. ఈ కంపెనీతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్ క్రేకర్‌లో వంటి సంస్థల్లో అలియా భట్ పెట్టుబడిదారిగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను 2022 ఏప్రిల్ 14న అలియా వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి రాహా అనే పాప ఉంది.

    దీపికా పదుకొనే (Deepika Padukone)

    దేశంలోనే రిచెస్ట్‌ హీరోయిన్‌గా దీపికా పదుకొనే టాప్‌-5 నిలిచింది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లుగా ఉన్నట్లు సర్వే సంస్థ ప్రకటించింది. దీపికా ఒక్కో సినిమాకు రూ.15-30 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు పలు బ్యూటీ ప్రాడెక్ట్స్‌ను ప్రమోట్‌ చేస్తూ రూ. కోట్లలో సంపాదన అర్జిస్తోంది. ఇటీవల హోమ్ ఫర్నిషింగ్‌ బిజినెస్‌లోకి దీపికా అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ‘పొటరీ బార్న్’లో అమె పెట్టుబడలు పెట్టింది. ’82 ఈస్ట్’ పేరుతో సొంత సెల్ఫ్‌ కేర్‌ బ్రాండ్‌ను ఆమె రన్‌ చేస్తోంది. మరోవైపు నిర్మాతగానూ మారింది. తన సొంత బ్యానర్‌లో ‘చపాక్‌’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version