Singer Indravathi Chauhan – ooo antava ooo antava Fame
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Singer Indravathi Chauhan – ooo antava ooo antava Fame

    Singer Indravathi Chauhan – ooo antava ooo antava Fame

    గ‌త కొన్ని రోజుల క్రితం తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త‌గా మ‌త్తుగా ఒక గొంతు వినిపించింది. అంద‌రూ ఎవ‌ర‌బ్బా ఈ సింగ‌ర్ అని గూగుల్‌లో వెత‌క‌డం ప్రారంభించారు. ఆమె పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ పాట పాడిన సింగ‌ర్ ఇంద్రావ‌తి చౌహ‌న్‌. ఈ ఒక్క పాట‌తో ఆమె ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయింది. పాట పాడేట‌ప్పుడు ఆమె గొంతులో ప‌లికిన ఎక్స్‌ప్రెష‌న్స్ యువ‌త‌ను ఉర్రూత‌లూగిస్తున్నాయి. ఇప్ప‌టికీ పాట ట్రెండ్ అవుతుంది.  2021లో గ్లోబ‌ల్ టాప్ 100 మ్యూజిక్ వీడియోస్‌లో నంబ‌ర్ వ‌న్ సాంగ్‌గా నిలిచింది. పాట‌కు స‌మంత ఆడిపాడ‌టం కూడా మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. 

    అయితే ఇంద్రావ‌తి చౌహ‌న్ ఎవ‌రో కాదు. ఫోక్ సాంగ్స్‌కు, హుషారైన సినిమా పాట‌లకు కేరాఫ్ అడ్ర‌స్ అయిన సింగ‌ర్ మంగ్లీ సొంత చెల్లెలు. కానీ మంగ్లీ చెల్లిగా ఆమె ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కాలేదు. ఫేమ‌స్ అయిన త‌ర్వాత మంగ్లీ సిస్ట‌ర్ అని తెలిసింది. ఇంద్రావ‌తి కూడా చిన్న‌ప్ప‌టి నుంచి సింగ‌ర్. జాన‌ప‌ద పాట‌లు పాడేది. కానీ ‘ఊ అంటావా’ పాట‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఇదే పాట‌ను మంగ్లీ క‌న్న‌డ‌లో పాడ‌టం విశేషం.

    సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఓవ‌ర్‌నైట్ స్టార్ అనే ప‌దం ఎక్కువ వినిపిస్తుంది. అది అంద‌రికీ సాధ్యం కాదు. ఎప్పుడో ఒక‌సారి గుర్తింపు వ‌చ్చినప్ప‌టికీ..దానికి ముందు వాళ్లు ప‌డిన క‌ష్టం చాలా ఉంటుంది. అలా ఇండ‌స్ట్రీలో న‌టీన‌టులు, ద‌ర్శ‌కుల‌కు ఒక టైమ్ వ‌స్తుంది. సింగ‌ర్స్‌కు కూడా అంతే. అదే టైమ్ ఇప్పుడు ఇంద్రావ‌తికి వ‌చ్చింది. అదేవిధంగా ఇప్పుడు పుష్ప ఐటెం సాంగ్‌తో ఆమె పాపుల‌ర్ అయ్యారు. ఇంద్రావ‌తి జాన‌ప‌ద పాట‌ల‌తో పాటు చిన్న‌ప్పుడు టీవీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. జెమిని టీవీలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి జ‌డ్జిగా చేసిన‌ ‘బోల్ బేబి బోల్’ అనే పాట‌ల ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసింది. ఇత‌ర టీవీ కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొంది.  జార్జిరెడ్డి సినిమాలో ‘జాజిమొగులాలి’ అనే పాట కూడా పాడింది. కానీ వాటితో రాని గుర్తింపు ఒక్క పుష్ప సినిమాలో పాడిన పాట‌తో వ‌చ్చింది. 

    చంద్రబోస్‌ రాసిన ఈ ఐటమ్ సాంగ్‌కు తన గొంతుతో ఈ పాటను మరో మెట్టు ఎక్కించింది ఇంద్రావ‌తి. త‌న హ‌స్కీ వాయిస్‌తో పాడిన ఊ అంటావా మామా ఊఊ అంటావా పాట‌ శ్రోత‌ల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. ఈ పాట చివ‌రిలో ఇంద్రావ‌తి ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ మ‌రింత ప్ల‌స్‌గా మారాయి.  ఒక్క పాట‌తో అక్క‌కు త‌గ్గ చెల్లిగా ఇండ‌స్ట్రీలో ప్రూవ్ చేసుకుంది. మ‌రి ఈ సినిమా త‌ర్వాత‌ ఇంద్రావ‌తికి ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version