Infinix 30 VIP: ఇన్ఫీనిక్స్ నుంచి మరో ఫోన్.. దీని ఫీచర్లు చూస్తే కొనేయాల్సిందే భయ్యా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Infinix 30 VIP: ఇన్ఫీనిక్స్ నుంచి మరో ఫోన్.. దీని ఫీచర్లు చూస్తే కొనేయాల్సిందే భయ్యా..!

    Infinix 30 VIP: ఇన్ఫీనిక్స్ నుంచి మరో ఫోన్.. దీని ఫీచర్లు చూస్తే కొనేయాల్సిందే భయ్యా..!

    June 13, 2023

    చైనా మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ నుంచి మరో ఫోన్ లాంచ్ అయింది. భారత్ మినహా ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ(Infinix 30 VIP) స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. ఇన్ఫీనిక్స్ 30 సిరీస్ నుంచి లాంచ్ అవుతున్న నాలుగో మోడల్ ఇది. మే నెల నుంచి ఇన్ఫీనిక్స్ 30, ఇన్ఫీనిక్స్ 30 5G, ఇన్ఫీనిక్స్ 30 ప్రో మోడళ్లు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇన్ఫీనిక్స్ 30 సిరీస్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర, తదితర వివరాలను తెలుసుకుందాం. 

    స్టోరేజీ

    ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ మెరుగైన స్టోరేజీ కెపాసిటీని కలిగి ఉంది. రెండు వేరియంట్లలో ఇది లభ్యమవుతోంది. 8 GB/12 GB RAMతో పాటు మరో 8 GB వర్చువల్ ర్యామ్‌తో వస్తోంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 

    కెమెరా

    ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ కలిగి ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు రెండు 2 మెగా పిక్సెల్ క్లారిటీ కలిగిన డెప్త్, మాక్రో సెన్సార్లను ఇది కలిగి ఉంది. 32 మెగా పిక్సెల్‌తో పంచ్ హోల్ డిస్‌ప్లేతో వస్తోంది. 1080*2040 రెజల్యూషన్‌కి సపోర్టు చేస్తుంది. 4K లో వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. 

    పర్ఫార్మెన్స్

    మీడియాటెక్ డైమెన్షన్ 8050 SoC చిప్‌సెట్‌తో పాటు 3GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ స్మార్ట్‌ఫోన్ డిజైన్ అయింది. 102Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌కి ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయనుంది.

    బ్యాటరీ

    ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ మోడల్ పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తోంది. 5000mAh కెపాసిటీతో కూడిన బ్యాటరీ దీని సొంతం. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కలదు. 0 నుంచి 80 శాతం వరకు 30 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు, దీనికి వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 50 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జర్‌తో 30 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 

    డిస్‌ప్లే

    డిస్ ప్లే విషయంలో ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ కాంప్రమైజ్ కావట్లేదు. 6.67-inch full-HD+ (2,400 x 1,080 pixels) AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. 900 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్ చేయనుంది.

    కలర్స్

    ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. గ్లేషియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్లలో ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. 

    ధర

    ఇన్ఫీనిక్స్ 30 వీఐపీ ధరను 299 డాలర్లుగా ప్రకటించింది. అంటే భారతీయ మార్కెట్లో దాదాపుగా రూ.24,600. భారత్‌లో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే తేదీపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version