Infinix Smart 8 HD: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. మతిపోగొడుతున్న ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Infinix Smart 8 HD: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

    Infinix Smart 8 HD: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

    December 8, 2023

    ఇన్ఫీనిక్స్‌ కంపెనీ ఇవాళ (డిసెంబర్‌ 8, 2023) సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ‘ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 హెచ్‌డీ’ (Infinix Smart 8 HD) పేరుతో నయా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో విడుదల చేసిన ‘Infinix Smart 7 HD’ మెుబైల్‌కు అనుసంధానంగా దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇందులోని బేసిక్‌ ఫీచర్లు టెక్‌ ప్రియులకు నచ్చుతాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో Infinix Smart 8 HD ఫోన్‌ ఫీచర్లు, ధర, ఇతర విశేషాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    ఈ మెుబైల్‌ 6.6 అంగుళాల  HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 90Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. 500 nits పీక్‌ బ్రైట్‌నెస్‌ను కూడా సమకూర్చారు. Android 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, octa-core Unisoc T606 SoC ప్రొసెసర్‌తో ఫోన్‌ పనిచేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Infinix Smart 8 HD స్మార్ట్‌ఫోన్‌కు 3GB RAM + 64GB స్టోరేజ్‌ను అందించారు. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని ఇన్ఫీనిక్స్‌ కల్పించింది. 

    పవర్‌ఫుల్‌ బ్యాటరీ

    ఈ మెుబైల్‌ను బడ్జెట్‌లోనే తీసుకొచ్చినప్పటికీ ఫోన్‌కు పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించారు. 5,000mAh బిగ్‌ బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 39 గంటల కాలింగ్‌ టైమ్‌ను కలిగి ఉంది. అలాగే 50 గం. మ్యూజిక్‌ ప్లేబ్యాక్ టైమ్‌, 36 రోజుల వీడియో ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తుందని కంపెనీ స్పెసిఫికేషన్స్‌లో తెలిపింది. 

    కెమెరా క్వాలిటీ

    Infinix Smart 8 HD మెుబైల్‌ను డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఇందులో 13MP ప్రైమరి కెమెరాగా ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌ ముందు భాగాన 8MP కెమెరాను ఫిక్స్ చేశారు. 

    కలర్ ఆప్షన్స్‌

    Infinix Smart 8 HD మెుబైల్‌.. మెుత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. క్రిస్టల్‌ గ్రీన్‌ (Crystal Green), షైనీ గోల్డ్‌ (Shiny Gold), టింబర్‌ బ్లాక్‌ (Timber Black) కలర్స్‌లో మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    ఈ నయా ఇన్ఫినిక్స్‌ మెుబైల్‌ ధరను కంపెనీ రూ.7,990గా నిర్ణయించింది. అమెజాన్‌ దీనిపై రూ.1500 వరకూ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. అన్ని రాయితీలు పోనూ మెుబైల్‌ను రూ.5,669కే దక్కించుకోవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version