‘అంటే సుంద‌రానికి’ హీరోయిన్‌ న‌జ్రియా ఫ‌హాద్ గురించి ఆసక్తికర విషయాలు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘అంటే సుంద‌రానికి’ హీరోయిన్‌ న‌జ్రియా ఫ‌హాద్ గురించి ఆసక్తికర విషయాలు

  ‘అంటే సుంద‌రానికి’ హీరోయిన్‌ న‌జ్రియా ఫ‌హాద్ గురించి ఆసక్తికర విషయాలు

  July 20, 2022

  తెలుగులో నేరుగా ఒక్కసినిమా చేయకపోయినా కేవలం డబ్బింగ్ సినిమాలతోనే ఇక్క‌డ కూడా అభిమానులను సంపాదించుకున్న నటి నజ్రియా. ‘రాజా రాణి’ సినిమాలో తన అభినయంతో తెలుగు సినీ ప్రియుల హృదయంలో చోటు సంపాదించుకుంది. త‌న లుక్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్‌తో కుర్రాళ్ల హృద‌యాల‌ను దోచుకుంది. కానీ కెరీర్ మంచి స్పీడ్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత‌కాలం దూరమైంది. మళ్లీ చాలా రోజులకు నేరుగా తెలుగు సినిమాతో తన అభిమానులను పలకరించబోతోంది. 

  న‌జ్రియాకు ఇన్‌స్టాలో 5.7మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె తెలుగులో చాలా పాపులర్ కాబోతుంద‌ని..బిజీగా మార‌బోతుంద‌ని హీరో నాని ఇటీవ‌ల అన్నాడు.

  న‌జ్రియా ఫ‌హాద్ వ‌య‌సు ఎంత‌?

  న‌జ్రియా డిసెంబ‌ర్ 20, 1994లో కేర‌ళ‌లోని త్రివేండ్రంలో జ‌న్మించింది. ఆమె త‌ల్లిదండ్రులు న‌జీముద్దిన్, బేగం బీనా. న‌జ్రియా వ‌య‌సు ప్ర‌స్తుతం 27 ఏళ్లు.

  న‌జ్రియా ఎత్తు?

  ఈ బ్యూటీ క్వీన్ ఎత్తు 5.4 అంగుళాలు

  హీరోయిన్‌గా న‌జ్రియా ఎన్ని సినిమాలు చేసింది?

  2006లో న‌జ్రియా బాల‌న‌టిగా పాల‌నుకు సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత ప‌ర‌మై (2010), ఒరు నాల్ వ‌రుమ్ (2010)లో కూడా  చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. హీరోయిన్‌గా కెరీర్‌ను 2013లో మ్యాడ్ డ్యాడ్ సినిమా ద్వారా ప్రారంభించింది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, త‌మిళంలో క‌లిపి 11 సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించింది.  అంటే సుంద‌రానికి సినిమాతో మొద‌టిసారిగా తెలుగులో అడుగుపెడుతుంది.  

  న‌జ్రియా ఫ‌హాద్‌కు పెళ్ల‌యిందా?

  న‌జ్రియా మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్‌ను ఆగ‌స్ట్ 21, 2014న ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి స‌మ‌యానికి ఆమె వ‌య‌సు 19 కాగా, ఆమె భ‌ర్త వ‌య‌సు 31.

  న‌జ్రియా నివాసం ఎక్క‌డ‌?

  2021 లో న‌జ్రియా, ఫ‌హాద్ జంట కేర‌ళలోని  కొచ్చిలో ఉన్న‌ ఒక విలాస‌వంత‌మైన‌ ఇంటికి ఫిష్ట్ అయ్యారు.

  న‌జ్రియా 19 ఏళ్ల‌కే ఎందుకు పెళ్లి చేసుకుంది?

  19 ఏళ్ల‌కే పెళ్లి చేసుకొని న‌జ్రియా ఆమె ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. అయితే ఫ‌హాద్ ఫాజిల్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయింది. ఫ‌హాద్‌కు అప్పుడే పెళ్లిసంబందాలు చూస్తుండ‌టంతో అత‌డిని వ‌దులుకోవ‌డం ఇష్టంలేక అప్పుడే పెళ్లి చేసుకుంది. కుటుంబ‌స‌భ్యులు కూడా వారి పెళ్లికి అంగీక‌రించారు.

  న‌జ్రియా ఎలా ఫేమ‌స్ అయింది?

  న‌జ్రియా మొద‌ట ఏషియానెట్ ఛాన‌ల్‌లో పుణ్య‌మాస్తులూడే అనే షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ షో టీవీలో చాలా ఫేమ‌స్ కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. దీంతో ఆమెకు హీరోయిన్‌గా అవ‌కాశాలు రావ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ ఆమె ఎక్స్‌ప్రెష‌న్స్‌, న‌ట‌న‌తో యువ‌త‌ను ఆక‌ట్టుకుంది.

  న‌జ్రియాకు పిల్ల‌లు ఉన్నారా?

  న‌జ్రియా, ఫ‌హాద్ జంట‌కు ఇంకా పిల్ల‌లు లేరు

  త‌మిళ‌నాడులో న‌జ్రియాను ఎక్స్‌ప్రెష‌న్ క్వీన్ అని ఎందుకంటారు?

  న‌జ్రియా త‌మిళంలో రాజా రాణి, న‌యాండి, వాయై మూడి పెస‌వం వంటి చిత్రాల్లో న‌టించింది. ఈ సినిమాల్లో ఆమె న‌ట‌న‌కు, ఎక్స్‌ప్రెష‌న్స్‌కు అక్క‌డ యూత్ ఫిదా అయిపోయారు. దీంతో న‌జ్రియాకు ఎక్స్‌పెష‌న్ క్వీన్ అని పేరు పెట్టేశారు.

  న‌జ్రియా ఫ‌హాద్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న సినిమా ఏది?

  న‌జ్రియా ప్ర‌స్తుతం తెలుగులో నానితో క‌లిసి అంటే సుంద‌రానికి సినిమాలో న‌టించింది. ఇది ఆమె మొద‌టి తెలుగు సినిమా. ఈ మూవీ జూన్ 10న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

  న‌జ్రియాకు ఇష్ట‌మైన్ ఫుడ్ ఏది?

  న‌జ్రియాకు బిర్యాని అంటే చాలా ఇష్టం

  న‌జ్రియాకు ఇష్ట‌మైన‌వి ఏంటి?

  ఈ బ్యూటీకి ట్రావెల్ చేయ‌డం అంటే చాలా ఇష్టం. పాట‌లు కూడా బాగా పాడుతుంది.

  న‌జ్రియా ఫ‌హాద్ అవార్డులు?

  ఏసియానెట్ అవార్డ్, వ‌నిత అవార్డు, కేర‌ళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు వంటి చాలా పుర‌స్కారాలు అందుకుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version