IPL Brand Value: దిమ్మతిరిగేలా చేస్తున్న ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ వాల్యూ.. ఏ జట్టుకు ఎంత ఆదాయం అంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL Brand Value: దిమ్మతిరిగేలా చేస్తున్న ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ వాల్యూ.. ఏ జట్టుకు ఎంత ఆదాయం అంటే?

    IPL Brand Value: దిమ్మతిరిగేలా చేస్తున్న ఐపీఎల్‌ జట్ల బ్రాండ్ వాల్యూ.. ఏ జట్టుకు ఎంత ఆదాయం అంటే?

    July 19, 2023

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL).. దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్​ వైడ్​గా ఈ లీగ్​కు ఉన్నంత క్రేజ్ ఇతర ఏ క్రికెట్ లీగ్​కు లేదు.​ 2008లో ప్రారంభమైన ఈ లీగ్​ ప్రతీ ఏడాది విశేష ఆదరణ, ఆదాయాన్ని అందుకుంటూ ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ ఏకంగా 3.2 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో రూ.26,432 కోట్లు. అమెరికాకు చెందిన బహుళజాతి స్వతంత్ర పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ హౌలిహన్‌ లోకీ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరి టాప్‌ 10 బ్రాండ్‌ వాల్యూ టీమ్స్‌లో ఏ జట్టు ఏ స్థానంలో ఈ కథనంలో తెలుసుకుందాం.

    1. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)

    ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) ఐపీఎల్‌లో అతిపెద్ద బ్రాండ్‌ వాల్యూ కలిగిన జట్టుగా నిలిచింది. రూ.1746 కోట్లతో అన్ని జట్ల కంటే టాప్‌లో ఉంది. 2022 ఐపీఎల్ సీజన్‌లో 146 మిలియన్‌ డాలర్లుగా ఉన్న చెన్నై బ్రాండ్ వాల్యూ.. 2023కు వచ్చేసరికి 45.2 శాతం పెరిగి 212 మిలియన్‌ డాలర్లకు చేరింది. 

    2. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB)

    CSK తర్వాత అత్యధిక ఆదాయం అర్జిస్తున్న జట్టుగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) నిలిచింది. ఈ జట్టు బ్రాండ్‌ వాల్యూ రూ.1606 కోట్లు (195 మిలియన్‌ డాలర్లు). గతేడాది పోలిస్తే చెన్నై కంటే ఎక్కువగా ఈ జట్టు వాల్యూ పెరిగింది. 2022లో 128 మిలియన్‌ డాలర్లుగా ఉన్న RCB మార్కెట్ వాల్యూ.. ఈ ఏడాదిలో 52.3 శాతం పెరగడం విశేషం

    3. ముంబయి ఇండియన్స్‌ (MI)

    ఐపీఎల్‌లో అత్యంత విజయమైన జట్టుగా ముంబయి ఇండియన్స్‌కు పేరుంది. ఈ నేపథ్యంలో ప్రతీ సంవత్సరం ఆ జట్టు బ్రాండ్‌ వాల్యూ పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం తన మార్కెట్‌ వాల్యూను రూ.1565 కోట్లకు పెంచుకున్న ముంబయి ఈ జాబితాలో మూడోస్థానంలో ఉంది. 2022లో 141 మిలియన్‌ డాలర్ల వాల్యూ కలిగిన MI.. 2023 నాటికి 190 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

    4. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ (KKR)

    షారుక్‌ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) జట్టు రూ.1491కోట్ల బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. జట్టు గెలుపోటములతో సంబంధం లేకుండా KKR మార్కెట్‌ వాల్యూ ఏటా పెరుగుతూ ఉండటం విశేషం. గతేడాదితో పోలిస్తే KKR బ్రాండ్ వాల్యూ 48.4శాతం పెరిగింది. 

    5. ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC)

    వరుస సీజన్లలో ఫెయిలవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తన బ్రాండ్‌ వాల్యూను మాత్రం కాపాడుకుంటూ వస్తోంది. ప్రస్తుతం రూ.1095 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో ఢిల్లీ టాప్‌ 5లో ఉంది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 60.2 శాతం DC మార్కెట్‌ విలువ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు వాల్యూ 133 మిలియన్‌ డాలర్లు. 

    6. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  (SRH)

    ఈ ఏడాది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) బ్రాండ్ వాల్యూ రూ.1054 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే జట్టు ఆదాయం 58.02 శాతం పెరగడం విశేషం. 2016లో ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచిన SRH ఆ స్థాయికి తగ్గ పర్‌ఫార్మెన్స్‌ ఇప్పటివరకూ చేయలేదు. 

    7. రాజస్థాన్ రాయల్స్‌ (RR)

    రూ. 988.8 బ్రాండ్‌ వాల్యూతో ఈ జాబితాలో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) ఏడో స్థానంలో ఉంది. 2022లో 59 మిలియన్‌ డాలర్లుగా ఉన్న RR ఫ్రాంచైజీ విలువ 2023కు వచ్చేసరికీ 103.4 శాతం పెరిగి 120 మిలియన్లకు చేరుకుంది. ఐపీఎల్‌లో ఈ స్థాయిలో ఒక జట్టు బ్రాండ్‌ వాల్యూ పెరగడం ఇదే తొలిసారి. 

    8. గుజరాత్‌ టైటాన్స్ (GT)

    అరంగేట్ర సీజన్‌లోనే (2022)  ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచి హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్(Gujarat Titans) అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజా సీజన్‌లోనూ అద్భుతంగా రాణించిన GT రన్నర్‌గా నిలిచింది. నిలకడైన ఆటతీరుతో GT తన బ్రాండ్‌ వాల్యూను కాపాడుకుంటోంది. ప్రస్తుతం ఆ జట్టు విలువ రూ.988 కోట్లు (120 మిలియన్ డాలర్లు)గా ఉంది.

    9. పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)

    రూ. 741 కోట్ల బ్రాండ్ వాల్యూతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు (Punjab Kings)చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గతేడాది 63 మిలియన్‌ డాలర్లుగా ఉన్న పంజాబ్‌ ఫ్రాంచైజీ విలువ… 2023లో 42.85 శాతం పెరిగి 90 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 

    10. లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG)

    ఐపీఎల్‌లో అతి తక్కువ బ్రాండ్‌ వాల్యూ కలిగిన జట్టుగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants) చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ జట్టు విలువ ప్రస్తుతం రూ. 683.92 కోట్లు. 2022, 2023 సీజన్లలో నిలకడగా రాణించిన LSG రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే టైటిల్‌ గెలవడంతో మాత్రం ఆ జట్టు విఫలమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version