Vivo తన కొత్త iQOO 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ పై కొంతకాలంగా టీజర్లు ఇస్తున్నప్పటికీ, దీని విడుదల తేదీ మాత్రం తెలియదు. ఇప్పుడు దాని లాంచ్ తేదీని స్పష్టంగా ప్రకటించారు. iQOO బ్రాండ్ ఈ డివైస్‌ను నవంబర్‌లో భారతదేశంలో కూడా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతున్న iQOO 13:
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రాబోతుందని భావిస్తున్నారు. ఇటీవలి స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ కార్యక్రమం తరువాత, ఈ ఫోన్ అంచనాలు మరింత పెరిగాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను తొలిసారి ఈ స్మార్ట్ ఫొన్‌లో ఉపయోగిస్తున్నారు.
లాంచ్ తేదీ వివరాలు:
చైనాలో iQOO 13ను అక్టోబర్ 30న, స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 04:00 గంటలకు (IST 01:30 PM) జరగనుంది. చైనా మార్కెట్‌లో లాంచ్ అయిన అనంతరం, ఈ ఫోన్ భారతదేశంలో కూడా విడుదల కానుంది. Realme GT 7 Pro తర్వాత, ఈ ఫోన్ భారత మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోయే రెండవ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. భారత్‌లో లాంచ్ అయిన తర్వాత, Amazon India, iQOO ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు.
డిస్‌ప్లే ప్రత్యేకతలు:
iQOO 13 6.82-అంగుళాల 2K Q10 ఎవరెస్ట్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది, ఇది BOE తో కలిసి అభివృద్ధి చేయబడింది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, దీని వలన స్మార్ట్ ఫొన్‌ను సాఫీగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి OLED ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది
డిజైన్:
iQOO 13 డిజైన్ గత మోడళ్లను పోలి ఉంటుందని చెబుతున్నారు, అయితే కొన్ని ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయి. ఈ ఫోన్ ఐకానిక్ డిజైన్‌తో, అయిల్ ఆఫ్ మ్యాన్, వైట్ లెజెండరీ ఎడిషన్, బ్లాక్ రేస్‌ట్రాక్ మరియు గ్రే వంటి రంగులలో లభించనుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో, ఎగువ భాగంలో స్పీకర్ గ్రిల్, కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్‌లతో వస్తుంది. వెనుక భాగంలో iQOO లోగో కనిపిస్తుంది. వైట్ మోడల్ BMW మోటార్‌స్పోర్ట్ బ్రాండింగ్ కలిగి ఉంటుంది.
స్పెసిఫికేషన్లు:
iQOO 13 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీని RAM, స్టోరేజ్ విషయానికి వస్తే, ఇది 24GB LPDDR5x RAM మరియు 1TB వరకు UFS 4.0 స్టోరేజ్ వేరియంట్‌లతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ ఫోన్ మల్టీ-లేయర్ గ్రాఫేన్, 7K అల్ట్రా-లార్జ్ ఏరియా VC కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది, దీని వలన సమస్యలు తక్కువగా ఉంటాయి. OriginOS 5 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్, అత్యుత్తమ వినియోగదార అనుభవాన్ని అందిస్తుంది.
గేమింగ్
iQOO 13.. Q2 గేమింగ్ చిప్ తో వస్తుంది, ఇది 2K సూపర్-రిజల్యూషన్, 144fps గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఇది 6150mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో రాబోతుందని కంపెనీ ధృవీకరించింది, ఇది మరింత దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ధర
భారత్‌లో iQOO 13 256 జీబీ వేరియంట్ ధర రూ.55,000 పైన ఉండొచ్చని తెలుస్తోంది. సెల్స్ సమయంలో బ్యాంక్ ఆఫర్స్ కలిపితే దీని ధర తగ్గవచ్చు.
.