iQoo Neo 9 Pro: ఐకూ నుంచి తిరుగులేని స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Neo 9 Pro: ఐకూ నుంచి తిరుగులేని స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    iQoo Neo 9 Pro: ఐకూ నుంచి తిరుగులేని స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

    February 29, 2024

    ప్రముఖ టెక్‌ కంపెనీ ఐకూ (iQoo) మరో శక్తివంతమైన మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) పేరుతో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 22న ఈ ఫోన్‌ భారత మార్కెట్‌లో లాంచ్ కానున్నట్లు కంపెనీ వర్గాలు తాజాగా ప్రకటించాయి. గతేడాది డిసెంబర్‌లోనే ఈ ఫోన్‌ చైనా మార్కెట్‌లో రిలీజై యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్‌లోకి వస్తుండటంతో టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మెుబైల్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    iQoo Neo 9 Pro మెుబైల్‌.. 6.78 అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్‌, 144Hz రిఫ్రెష్‌ రేటును అందించారు. Snapdragon 8 Gen 2 SoC ప్రొసెసర్‌, MediaTek Dimensity చిప్‌సెట్‌, Android 14 ఆధారిత Funtouch OS 14పై మెుబైల్‌ వర్క్‌ చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ ఫోన్‌ గతేడాది చైనాలో 12GB RAM + 256GB స్టోరేజ్‌తో విడుదలైంది. భారత్‌లోనూ ఇదే విధంగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు వీలుంది. 

    బిగ్‌ బ్యాటరీ

    iQoo Neo 9 Pro మెుబైల్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో తీసుకొచ్చారు. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5,160mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. దీని ద్వారా మెుబైల్ చాలా వేగంగా ఛార్జ్‌ అవుతుందని ఐకూ వర్గాలు తెలిపాయి.

    కెమెరా

    ఈ iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో రూపొందింది. 50MP + 50MP కెమెరాలను ఫోన్‌ వెనుక భాగంలో ఫిక్స్‌ చేశారు. ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను అందించారు. వీటితో మంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని ఐకూ వర్గాలు పేర్కొన్నాయి.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ ఐకూ మెుబైల్.. Wi-Fi, GPS, Bluetooth v5.40, NFC, USB OTG, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే యాక్సిలోమీటర్‌, ambient light సెన్సార్‌, డిజిటల్ దిక్సూచి, గైరోస్కోప్‌, ప్రొక్సిమిటీ సెన్సార్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా మెుబైల్‌లో ఉంది. 

    ధర ఎంతంటే?

    ఫిబ్రవరి 22న జరిగే లాంచింగ్‌ ఈవెంట్‌లో iQOO Neo 9 Pro మెుబైల్‌ ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. చైనాలో ఈ ఫోన్‌ ధర CNY 2,999 కాగా.. ఇది భారత కరెన్సీ ప్రకారం రూ.35,000లకు సమానం. కాబట్టి ఈ ఫోన్‌ ధర రూ.40,000 లోపే ఉండవచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version