iQoo Neo 9 Pro: మోస్ట్‌ వాంటెడ్‌ మెుబైల్‌ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌.. ఫీచర్లు చూస్తే వెంటనే బుక్‌ చేస్తారు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Neo 9 Pro: మోస్ట్‌ వాంటెడ్‌ మెుబైల్‌ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌.. ఫీచర్లు చూస్తే వెంటనే బుక్‌ చేస్తారు!

    iQoo Neo 9 Pro: మోస్ట్‌ వాంటెడ్‌ మెుబైల్‌ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌.. ఫీచర్లు చూస్తే వెంటనే బుక్‌ చేస్తారు!

    February 8, 2024

    వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐకూ (iQOO) తక్కువ కాలంలోనే టాప్‌ మెుబైల్‌ కంపెనీల్లో ఒకటిగా మారిపోయింది. ఐకూ రిలీజ్‌ చేసే అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు టెక్‌ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఇదిలా ఉంటే ఐకూ మరో సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘iQOO Neo 9 Pro’ పేరుతో ఫిబ్రవరి 22న ఈ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మెుబైల్‌ ప్రీ బుకింగ్స్‌ సైతం ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మెుదలయ్యాయి. దీంతో ఈ ఫోన్‌ గురించి తెలుసుకునేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఐకూ నియో 9ప్రో’ ధర, ఫీచర్లు ఇతర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్

    iQoo Neo 9 Pro మెుబైల్‌.. 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో రానుంది. 2800×1260 pixels (QHD+), 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 3,000 nits పీక్‌ బ్రైట్‌నెస్‌ను ఫోన్‌కు అందించారు. Android 14 ఆధారిత OriginOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌, Snapdragon 8 Gen 2 SoC ప్రొసెసర్‌పై ఫోన్‌ పని చేయనుంది.

    ర్యామ్‌ & స్టోరేజ్

    ప్రస్తుతమున్న సమాచారం మేరకు iQOO Neo 9 Pro మెుబైల్.. 12GB RAM / 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 8GB RAM / 256GB వేరియంట్‌లో కూడా రావొచ్చని అంటున్నారు. దీనిపై లాంచింగ్‌ రోజున స్పష్టత వచ్చే అవకాశముంది. 

    బ్యాటరీ

    ఈ నయా ఐకూ మెుబైల్‌.. పవర్‌ఫుల్‌ బ్యాటరీని కలిగి ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కలిగిన 5,160 mAh బిగ్‌ బ్యాటరీని ఫోన్‌కు అమర్చారు. దీని ద్వారా మెుబైల్‌ను అత్యంత వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

    కెమెరా సెటప్‌

    iQoo Neo 9 Pro మెుబైల్‌.. వెనుక భాగంలో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50MP IMX920 ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్‌ షూటర్‌ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం ముందు వైపు 16MP ఫ్రంట్‌ కెమెరాను కూడా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. 

    కలర్ ఆప్షన్స్‌

    ఈ ఫోన్‌ రెండు కలర్‌ వేరియంట్లలో లభించనుంది. కాన్‌క్వెరర్‌ బ్లాక్‌ (Conqueror Black), ఫీరి రెడ్‌ (Fiery Red) రంగుల్లో ఫోన్‌ను పొందవచ్చు.

    ధర ఎంతంటే?

    iQoo Neo 9 Pro ధర గురించి ఫిబ్రవరి 22న అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ ఫోన్‌ (8GB + 256GB) ప్రైస్‌ను కంపెనీ రూ.37,999గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై రూ.3,000 వరకూ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సమాచారం. ఫలితంగా రూ.34,999కే మెుబైల్‌ను దక్కించుకోవచ్చని పలు టెక్‌ వెబ్‌సైట్స్‌ అంచనా వేస్తున్నాయి. 

    ప్రీ బుకింగ్స్ షురూ

    ఈ నయా ఐకూ మెుబైల్‌కు సంబంధించి  ప్రీ-బుకింగ్స్‌ కూడా  కొద్దిసేపటి క్రితమే మెుదలయ్యాయి. రూ.1000 చెల్లించి ఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ ద్వారా మెుబైల్‌ ఫైనల్‌ ప్రైస్‌పై రూ.1,000 డిస్కౌంట్‌ పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. iQoo India అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version