iQoo Z8 Series: ఆర్నెళ్లలోనే సిరీస్ అప్‌గ్రేడేషన్‌తో వస్తున్న ఐక్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు లీక్..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Z8 Series: ఆర్నెళ్లలోనే సిరీస్ అప్‌గ్రేడేషన్‌తో వస్తున్న ఐక్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు లీక్..!

    iQoo Z8 Series: ఆర్నెళ్లలోనే సిరీస్ అప్‌గ్రేడేషన్‌తో వస్తున్న ఐక్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు లీక్..!

    August 17, 2023

    చైనా మొబైల్ దిగ్గజం వివో ప్రస్తుతం భారత మార్కెట్‌లో హవా కొనసాగిస్తోంది. మెరుగైన ఫీచర్లు కలిగిన సబ్ బ్రాండ్‌లతో మొబైల్ ప్రియులను పలకరిస్తోంది. ఇందులో ఓ సబ్ బ్రాండే ఐక్యూ(iQoo). ఐక్యూ జడ్ సిరీస్ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ సక్సెస్ అయింది. దీంతో ఇందులో మాడిఫికేషన్లను చేస్తూ ఒక్కో సిరీస్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఐక్యూ జడ్ 7 సిరీస్‌(iQoo Z7 Series)ని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆరు నెలలు తిరక్కుండానే ఐక్యూ జడ్ 8 సిరీస్‌(iQoo Z8 Series)ని లాంఛ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ మేరకు కొన్ని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

    చైనా లీకుదారులు రివీల్ చేసిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. అయితే, వీవో మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐక్యూ జడ్ 7 సిరీస్‌కి కొనసాగింపుగా ఐక్యూ జడ్ 8 సిరీస్‌ని తీసుకొస్తోంది. మరి, ఈ సిరీస్‌లో ఏమేం ఫీచర్లు ఉండబోతున్నాయో తెలుసుకుందామా. 

    మోడళ్లు

    ఐక్యూ జడ్ 8 సిరీస్ మూడు మోడళ్లలో రానున్నట్లు తెలుస్తోంది. ఐక్యూ జడ్ 8 బేస్ వేరియంట్(iQoo Z8), ఐక్యూ జడ్ 8 ప్రో(iQoo Z8 Pro), ఐక్యూ జడ్ 8 ఎక్స్(iQoo Z8x) వేరియంట్లుగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

    స్టోరేజ్

    ఐక్యూ జడ్ 8 సిరీస్ మెమొరీ భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 12GB RAM వరకు ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు 512GB గరిష్ఠ స్టోరేజ్‌తో రానుంది. 

    డిస్‌ప్లే

    ఐక్యూ జడ్ 8 సిరీస్‌లో హై రిఫ్రెష్ రేట్ కలిగిన లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లేని వాడనున్నట్లు తెలుస్తోంది. 6. 144Hz రిఫ్రెష్ రేటుతో 6.64అంగుళాల ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఇందులో ఉండనుందట. అయితే, ఐక్యూ జడ్7 సిరీస్ మాదిరి ఇండియాలోనూ డిస్‌ప్లే మారుతుందేమో చూడాలి. ఐక్యూ జడ్7 సిరీస్‌ చైనాలో ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రాగా భారత్‌లో అమోల్డ్(AMOLED) డిస్‌ప్లేతో రిలీజైంది.

    పర్ఫార్మెన్స్

    ఐక్యూ జడ్ 8 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ చేయనుంది. మరోవైపు, ఐక్యూ జడ్ 8 ఎక్స్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో రానున్నట్లు టాక్. 

    బ్యాటరీ

    ఐక్యూ జడ్ 8 సిరీస్ బలమైన బ్యాటరీ బ్యాకప్‌తో వస్తోంది. 5,000mAh కెపాసిటీతో బ్యాటరీ రానుంది. 2,440mAh కెపాసిటీ కలిగిన డ్యుయల్ సెల్ బ్యాటరీ ఉండనుంది. దీంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. అయితే, ఐక్యూ జడ్ 8 ఎక్స్ వేరియంట్‌కి 44వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

    కెమెరా

    ఐక్యూ జడ్ 8 సిరీస్ కెమెరాపై పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. 64 మెగా పిక్సెల్ క్లారిటీతో రియర్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫెసిలిటీతో ఇది రానుంది.

    కలర్స్

    ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్స్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ రంగుల్లో ఇది రానున్నట్లు తెలుస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version