75వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా అంత‌రిక్షం నుంచి భార‌త్‌కు శుభాకాంక్ష‌లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 75వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా అంత‌రిక్షం నుంచి భార‌త్‌కు శుభాకాంక్ష‌లు

    75వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల సంద‌ర్భంగా అంత‌రిక్షం నుంచి భార‌త్‌కు శుభాకాంక్ష‌లు

    August 13, 2022
    in News, World

    Screengrab Twitter:

    భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర‌ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అంత‌రిక్షం నుంచి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇస్రో చేప‌డుతున్న‌ “గగన్‌యాన్” విజయవంతం కావాలని కోరుతూ వీడియో సందేశాన్ని పంపారు – ఈ వీడియోను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు షేర్ చేశారు. “ఇస్రోతో మా భాగస్వామ్యాన్ని విస్తరించడం, కలిసి విశ్వాన్ని అన్వేషించడం భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల కోసం మనందరి లక్ష్యం” అని ఆమె చెప్పారు. ‘గగన్‌యాన్‌’కు సన్నాహాలు పూర్తయ్యాయని, భారత సంతతికి చెందిన మానవులు వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వెళతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ గత నెలలో తెలిపారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version