Jagapathi Babu: ‘వెదవల’కే అవార్డులు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jagapathi Babu: ‘వెదవల’కే అవార్డులు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

    Jagapathi Babu: ‘వెదవల’కే అవార్డులు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

    ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapati Babu)కి ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో మంచి పేరుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌ రోల్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా నెగిటివ్‌ రోల్స్‌ చేస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ మూవీకి సంబంధించి బెస్ట్ విలన్‌గా ఐఫా అవార్డ్‌ సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్‌ భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. జగపతి బాబు లాంటి సీనియర్ నటుడి నుంచి ఇలాంటి మాటలు అసలు ఊహించలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 

    ‘ఎదవలకే అవార్డులు’

    కన్నడ నటుడు దర్శన్‌ హీరోగా నటించిన ‘కాటేరా’ చిత్రంలో జగపతి బాబు విలన్‌ పాత్ర పోషించాడు. నెగిటివ్‌ రోల్‌లో అత్యుత్తమ నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. పైగా కన్నడలో ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ (Dubai)లో జరిగిన ఐఫా 2024 అవార్డు (IIFA Awards-2024)ల వేడుక కార్యక్రమంలో జగ్గుబాయ్‌కు బెస్ట్ విలన్ (villain) అవార్డ్ (award) వచ్చింది. దీనిపై స్పందించిన జగపతి బాబు ‘ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి’ అనే క్యాప్షన్ ఇచ్చి అవార్డుకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అవార్డులు తీసుకోవడం ఇష్టం లేకపోతే తిరిగి ఇచ్చేయాలని సూచిస్తున్నారు. 

    జగ్గుభాయ్‌ మాటలకు కారణమదేనా?

    ప్రముఖ నటుడు జగపతి బాబు కెరీర్‌ ప్రారంభంలో హీరోగా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కెరీర్‌లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే చేసిన ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేశారు. అయితే హీరోగా ఎన్ని మంచి సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయనకు అవార్డులు రాలేదు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మెుదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన వద్దకు అవార్డులు క్యూ కట్టాయి. ముఖ్యంగా విలన్‌ రోల్స్‌కు పెద్ద ఎత్తున అవార్డ్స్‌ దక్కాయి. ‘లెెజెండ్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’, ‘మన్నెం పులి’ (తెలుగు డబ్బింగ్‌), తాజాగా ‘కాటేరా’ చిత్రాలకు నంది, ఫిల్మ్‌ఫేర్‌, సైమా, ఐఫా అవార్డులు వరించాయి. పాజిటివ్‌ రోల్స్‌ చేసినప్పుడు రాని అవార్డ్స్‌ విలన్‌ పాత్రలకే ఎక్కువగా వస్తుండటంతో ఆయన ఈ కామెంట్స్‌ చేసి ఉండొచ్చు. 

    లెజెండ్‌తో లైఫ్‌ టర్నింగ్‌!

    చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి దిగ్గజ నటుల నుంచి పోటీని తట్టుకొని జగపతిబాబు ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశారు. అయితే హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. అన్నయ్యగా, పోలీసు ఆఫీసర్‌గా, కుటుంబ పెద్ద పాత్రల్లో కనిపించి అలరించారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జగ్గుభాయ్‌కు పేరు రాలేదు. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ సమయంలో బోయపాటి నుంచి విలన్‌ ఆఫర్‌ జగ్గుభాయ్‌కి వచ్చింది. అది కూడా బాలకృష్ణకు ప్రత్యర్థిగా చేసే ఛాన్స్‌ దక్కింది. ‘లెజెండ్‌’లో బాలయ్యకు పవర్‌ఫుల్‌ ప్రత్యర్థిగా నటించి జగపతి బాబు అందరినీ ఆశ్చర్యపరిచాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ఆ సినిమా తర్వాత తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం జగపతిబాబుకు రాలేదు. 

    ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa). ఇందులో జగపతి బాబు నటిస్తున్నారు. ఆయన పాత్ర ఏవిధంగా ఉంటుందో సినీ వర్గాలు ప్రకటించలేదు. అయితే కచ్చితంగా నెగిటివ్‌ రోల్‌లోనే ఆయన అలరిస్తారన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరోవైపు తమిళ స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ (Kanguva)లోనూ జగ్గుభాయ్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్‌ 14న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ఈ రెండు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌తో జగపతి బాబు బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో ఏ మూవీ సక్సెస్‌ అయినా దేశవ్యాప్తంగా మరోమారు ఆయన పేరు మార్మోగడం ఖాయమని చెప్పవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version