Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?

    Jio 5G Smartphone: 5G ఫోన్లలోనూ జియో మార్క్‌.. రూ.10 లోపే అత్యాధునిక ఫోన్‌..! ఫీచర్లకు ఫిదా కావాల్సిందే?

    June 23, 2023

    అందుబాటు ధరలోనే యూజర్లకు 5G ఫోన్‌ని అందించాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో అడుగులేస్తోంది. ఈ మేరకు గతేడాది నుంచే గూగుల్‌తో కలిసి పనిచేస్తోంది. తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు కలిగిన ఫోన్‌ని డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. అయితే, తాజాగా జియో 5G(Jio  5G Phone) ఫోన్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై క్లారిటీ లేనప్పటికీ లీకైన ఫొటోలు, ఇంతకుముందు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఎంట్రీ లెవెల్ ఫోన్‌లా కనిపిస్తోంది. మరి దీని ఫీచర్లేంటో ఓ సారి చూసేద్దామా. 

    కెమెరా

    లీకైన ఫొటోలను బట్టి జియో 5G స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ క్లారిటీతో ఏఐ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్‌తో రానుంది. ఇక సెల్ఫీ కెమెరా 5 మెగాపిక్సెల్‌తో డిజైన్ అయి ఉండొచ్చు. 

    కలర్స్

    ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేదు. కానీ, ఫొటోల్లోని డివైజ్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తోంది. ఫైబర్ ప్లాస్టిక్‌తో బాడీని తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై జియో లోగో ఉంది. 

    పర్ఫార్మెన్స్

    జియో 5G ఫోన్ యునిసోక్ 5G(Unisoc 5G) లేదా డైమెన్సిటీ 700 SoC(Dimensity 700 SoC) చిప్‌సెట్‌తో రానుందని ఓ ట్విటర్ యూజర్ వెల్లడించారు. అయితే, ఇందులో స్నాప్‌డ్రాగన్ 480 SoC వాడుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌కి సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సర్వీసెస్‌ డీఫాల్ట్‌గా రానున్నాయి.

    స్టోరేజీ 

    జియో 5G స్మార్ట్‌ఫోన్ స్టోరేజీకి సంబంధించి ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 4GB ర్యామ్(RAM)తో పాటు 32GB ఇంటర్నల్ మెమొరీ ఇందులో ఉండనుంది. 

    డిస్‌ప్లే

    ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగులాల HD+LCD డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. రిఫ్రెష్ రేటు 90Hzగా ఉండనుంది. 

    బ్యాటరీ 

    జియో 5G స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీతో రానుంది. 5,000mAh కెపాసిటీతో వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు 18 వాట్స్ ఛార్జర్ వస్తుంది. 

    ధర

    ఈ జియో 5G ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉండనుందని ట్విటర్ యూజర్ షేర్ చేశారు. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉండనున్నట్లు తెలిసింది. 

    ఈ ఏడాదే లాంచ్?

    జియో 5G స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీపావళి నుంచి న్యూ ఇయర్ మధ్యలో ఎప్పుడైనా ఫోన్ లాంచ్ కావొచ్చని ఓ ట్విటర్ యూజర్ తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version