Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా చూసి ఆశ్చర్యపోయిన సెన్సార్‌ బోర్డు.. మూవీలో ఇవే హైలెట్స్‌ అట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా చూసి ఆశ్చర్యపోయిన సెన్సార్‌ బోర్డు.. మూవీలో ఇవే హైలెట్స్‌ అట!

    Kalki 2898 AD: ‘కల్కి’ సినిమా చూసి ఆశ్చర్యపోయిన సెన్సార్‌ బోర్డు.. మూవీలో ఇవే హైలెట్స్‌ అట!

    June 19, 2024

    టాలీవుడ్‌ సహా యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ఈ సినిమాను సెన్సార్‌ సభ్యుల ముందుకు తీసుకెళ్లింది. మూవీని చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు.. కల్కిలోని అద్భుతమైన విజువల్స్‌కు ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను చూసి వారు బాగా ఇంప్రెస్‌ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    రన్‌ టైమ్ ఎంతంటే?

    హైదరాబాద్‌లోని క్యూబ్ ఆఫీస్‌లో సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ (U/A Certificate) జారీ చేశారట. మూవీ రన్ టైమ్‌ను 2 గంటల 55 నిమిషాలకు వారు లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించేలా సెన్సార్‌ బోర్డు ఈ U/A సర్టిఫికేట్‌ను జారి చేసినట్లు సమాచారం. ఇక కల్కి రన్‌టైమ్‌ విషయంలో పెద్దగా కోతలు కూడా పడలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రన్‌టైమ్‌ పరంగా చూస్తే కల్కి చిత్రం భారీ నిడివి కలిగిన సినిమాగా చెప్పవచ్చు. గతంలో ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ (Bahubali), ‘బాహుబలి 2’ (Bahubali 2), ‘సలార్‌’ (Salaar) వంటి చిత్రాలు దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

    సెన్సార్‌ బోర్డు ఇంప్రెస్‌..!

    కల్కి సినిమాను చూసి సెన్సార్‌ బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాలో ఇలాంటి విజువల్స్ గతంలో ఎప్పుడూ చూడలేదని వారు అభిప్రాయ పడినట్లు సమాచారం. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా, యూనిక్ కాన్సెప్ట్‌తో ఉందని.. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని వ్యాఖ్యానించినట్లు టాక్‌. ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అదిరిపోయిందని సమాచారం. భైరవగా ప్రభాస్‌ దుమ్ముదులిపాడని, కల్కిలో ట్విస్టులకు ప్రేక్షకులకు మైండ్ పోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), అలాగే కమల్ హాసన్ (Kamal Hassan) పాత్రలు కూడా చాలా బాగున్నాయని అంటున్నారు. వాళ్లని ఎలాగైతే చూడాలని ప్రేక్షకులు భావించారో ఆ స్థాయిలోనే వారి పాత్రలను తీర్చిదిద్దారని సెన్సార్‌ సభ్యులు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే అద్భుతమైన ట్విస్ట్.. కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందని చెబుతున్నారు. 

    18 ఏళ్ల తర్వాత రీఎంట్రీ!

    అలనాటి హీరోయిన్‌ శోభన (Sobhana).. కల్కి సినిమాలో కీలక పాత్ర పోషించారు. ‘మరియమ్‌’ అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్లు చిత్రయూనిట్‌ తాజాగా ప్రకటించింది. ఆమె పాత్రకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఈ పోస్టర్‌కు ‘ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఆమె పాత్రపై సినీ అభిమానుల్లో ఆసక్తి మెుదలైంది. ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన శోభన.. తెలుగులో చివరిసారి ‘గేమ్‌’ (2006) సినిమాలో కనిపించారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ‘కల్కి 2898 ఏడీ’తో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version