Kamal Haasan: కమల్‌ హాసన్‌ తరహాలో స్టార్‌ ట్యాగ్‌ను తిరస్కరించిన తెలుగు హీరో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kamal Haasan: కమల్‌ హాసన్‌ తరహాలో స్టార్‌ ట్యాగ్‌ను తిరస్కరించిన తెలుగు హీరో తెలుసా?

    Kamal Haasan: కమల్‌ హాసన్‌ తరహాలో స్టార్‌ ట్యాగ్‌ను తిరస్కరించిన తెలుగు హీరో తెలుసా?

    November 11, 2024

    దేశం గర్వంచతగ్గ నటుల్లో తమిళ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఒకరు. విలక్షణమైన నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇండస్ట్రీలకు అతీతంగా దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాత ఏ నటుడికి అందనంత ఎత్తులో కమల్‌ హాసన్‌ నిలిచారు. ఇటీవలే నవంబర్‌ 7న తన 70వ పుట్టిన రోజు జరుపుకొని సెలబ్రిటీలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విషెస్ అందుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సెన్సేషనల్‌ లేఖను కమల్‌ హాసన్‌ రిలీజ్‌ చేశారు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారాయి. 

    లేఖలో ఏమన్నారంటే..

    యావత్‌ దేశం మెచ్చే నటుడు కావడంతో కమల్‌ హాసన్‌ను ఆయన అభిమానులు ప్రేమగా ‘ఉలగనాయగన్’ (Ulaga Nayagan) అనే బిరుదుతో పిలుస్తుంటారు. దాని అర్థం యూనివర్సల్‌ స్టార్‌. తెలుగులోనూ ఆర్థం వచ్చేలా కమల్‌ను విశ్వనాయకుడు, లోకనాయకుడు అనే టైటిల్స్‌తో ఫ్యాన్స్ సంభోదిస్తుంటారు. అయితే తనకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదని తాజాగా విడుదల చేసిన లేఖలో కమల్ అన్నారు. ఈ మేరకు స్పెషల్‌ లేఖను సైతం సోషల్ మీడియాలో ఇంగ్లీషు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేశారు. ‘నా వర్క్‌కు మెచ్చి ఉలగనాయగన్‌ వంటి ఎన్నో బిరుదులు అందించినందుకు కృతజ్ఞుడిని. ఇతర కళల మాదిరే సినిమా కూడా అందరిది. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. స్టార్ ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నా. అభిమానులు, సినీ ప్రముఖులు, తోటి ఇండియన్స్‌ నన్ను కేవలం కమల్‌ హాసన్‌ లేదా కె.హెచ్‌ అని పిలవాలని అభ్యర్థిస్తున్నా’ అంటూ లేఖలో రాసుకొచ్చారు.

    ‘నేను.. నిత్య విద్యార్థి’

    బహిరంగ లేఖలో మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కమల్‌. సినిమా అనేది ఏ వ్యక్తి ఊహాకు అందనిదని తెలిపారు. ఈ కళలో తాను నిత్య విద్యార్థినని స్పష్టం చేశారు. ఇందులో ఎన్నో విషయాలు నేర్చుకొని, మరింత ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇతర కళల మాదిరిగానే సినిమా కూడా అందరికీ చెందినదని పేర్కొన్నారు. అసంఖ్యాక కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సహకారం, విభిన్నైన గొప్ప కథలకు ప్రతిబింబమే సినిమా అంటూ కమల్‌ రాసుకొచ్చారు. తనలోని లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు నటుడిగా మెరుగుపడేందుకు ప్రయత్నిస్తున్నాని అన్నారు. నటుడిగా నా మూలాలకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే బిరుదులను తిరస్కరిస్తున్నట్లు మరోమారు స్పష్టం కమల్‌ చేశారు. 

    ఆ తెలుగు స్టార్‌ సైతం..

    నటీనటులు స్టార్‌ ట్యాగ్స్‌ను దూరంపెట్టడం ఇది తొలిసారి కాదు. నటనలోని సహజత్వంతో నాని నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్‌లో ‘శ్యామ్‌ సింగరాయ్‌‘ సినిమా ప్రమోషన్స్‌ సందర్భంగా ఈ యంగ్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేచురల్ స్టార్‌ నాని ట్యాగ్‌ను తీసేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇకపై తనను కేవలం నాని అని పిలిస్తే చాలని చెప్పారు. కానీ ఆయన అభిమానులు ఇప్పటికీ నేచురల్‌ స్టార్ అంటూ తమ హీరోను ముద్దుగా పిలుచుకుంటున్నారు. మరోవైపు కోలీవుడ్‌కు చెందిన అజిత్‌ సైతం తన ట్యాగ్స్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. తన పేరుకు ముందు ‘తలా’ లేదా ఏ ఇతర స్టార్ ట్యాగ్స్‌ జోడించవద్దని కోరారు. కేవలం అజిత్‌ కుమార్‌ లేదా అజిత్‌, ఏకే అని పిలవమని అభిమానులకు సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version