REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

    REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

    October 21, 2022

    స్పై థ్రిల్లర్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 80’s నుంచి చూస్తూనే ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో కథ కన్నా కథనం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లాంటి థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు PS మిత్రన్‌ మరోసారి ఆకట్టుకున్నాడా? కార్తీ మరోసారి తన నటనతో అలరించాడా? చూద్దాం.

    కథ:

    కథ అంత కొత్తదేం కాదు. ‘సర్దార్‌’( కార్తీ) ఓ పేరుమోసిన గూఢచారి. అతడికి అసాధ్యమైన మిషన్ అంటూ ఏదీ ఉండదు. అలాంటి ఓ గూఢచారిపై ఓ సంఘటన కారణంగా దేశద్రోహిగా ముద్రపడుతుంది. కట్‌ చేస్తే విజయ్‌ ప్రకాశ్‌(కార్తీ) ఓ పోలీస్‌ అధికారి పక్కా పబ్లిసిటీ పిచ్చోడు. ఇతడు ‘సర్దార్‌’ కుమారుడు కూడా. తండ్రి మాయని మచ్చను తనకు అంటించుకోకూడదని నిత్యం సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి  ఓ ఫైల్‌ మాయమవుతుంది. బాగా పేరుస్తుందనే కారణంతో విజయ్‌ ప్రకాశ్ ఆ ఫైల్‌ వెతికే పనిలో పడతాడు. ఇంతలో నీటి హక్కుల కోసం పోరాడే ఓ సామాజిక కార్యకర్త చనిపోతుంది. అసలు ఆ ఫైల్‌లో ఏముంది? కార్తీ తన తండ్రి గురించి ఏం తెలుసుకున్నాడు? ఈ హత్యకు, ఫైల్‌కు ఏంటి సంబంధం ఇదంతా తెరపై చూడాలి. 

    ఎలా ఉందంటే..

    తెలిసిన కథలాంటిదే అయినా పీఎస్‌ మిత్రన్‌ తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. ఫస్టాఫ్‌లో చాలా వరకూ సరదాగా సాగిపోతుంది. ఫైల్‌, హత్య అంశాలతో కథ ఒక్కసారిగా సీరియస్‌గా అవుతుంది. కథనం కూడా అంత కొత్తగా లేకపోయినా దర్శకుడు ప్రేక్షకుడికి బోర్‌ కొట్టకుండా నడిపిస్తాడు. హీరో పాత్రలకు మాస్‌ ఎలిమెంట్స్‌ను కూడా సమయానుగుణంగా జోడించాడు. అజ్ఞాతంలో ఉన్న ఓ గూఢచారి దేశ రక్షణ కోసం పోరాడే సీన్లు ఆకట్టుకునేలా తీశాడు. ఎక్కడా సహజత్వం దెబ్బతినకుండా గూఢచారి పాత్రను తీర్చిదిద్దాడు. దీనికి ‘జల సంరక్షణ’ అనే సామాజిక అంశాన్ని జోడించి మెసేజ్‌ కూడా ఇచ్చాడు. సినిమాకు ప్రధాన బలం కార్తీ నటన అని చెప్పొచ్చు. ద్విపాత్రాభినయంలో అదరగొట్టాడు. రాశీ ఖన్నా, లైలా తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్‌తో పాటు ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువను దర్శకుడి కథ, కథనానికి తగ్గట్టుగా ఉన్నాయి. 

    చివరిగా…

    పరిచయమున్న కథ, కథనమే అయినా మాస్‌ అంశాలతో  ఆసక్తిగా సాగే స్పై థ్రిల్లర్. దీపావళి మిగతా సినిమాల్లోని కామెడీ, డ్రామా, ఎమోషన్స్‌ కాకుండా థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారు “సర్దార్‌”కు చక్కగా వెళ్లొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version