బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగుతోంది. స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకొని నేటితో సంవత్సరం పూర్తవడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం #KiaraAdvani, #SidKiara హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ జంటకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్ అవుతోంది.
గతేడాది ఈ రోజునే (07 ఫిబ్రవరి, 2024) ఈ బాలీవుడ్ స్టార్ జంట పెళ్లి జరిగింది. రాజస్థాన్ జైసల్మేరులోని ప్యాలెస్‌లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది.
నటి కియారా అద్వానీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. ఆమె తెలుగులోనూ పలువురు స్టార్ హీరోలతో నటించింది.
2018లో మహేష్‌తో చేసిన ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమా ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరుసటి ఏడాది రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ చరణ్‌తో పాటు కియారా కూడా మంచి నటనే కనబరిచి ప్రశంసలు అందుకుంది.
ఆ సినిమా ఫ్లాప్‌తో కియారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమై అక్కడ పలు హిట్ సినిమాల్లో నటించింది.
ఇక కియారా (Kiara Advani) చేసిన ప్రముఖ బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తొలుత ‘ఫుగ్లీ’ (Fugly) చిత్రం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది.
తన రెండో చిత్రం ఎం.ఎస్ ధోని (M.S. Dhoni: The Untold Story) ద్వారా కియారా పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇందులో సాక్షి రావత్ పాత్రలో ఆమె జీవించింది.
‘లస్ట్ స్టోరీస్’ (Lust Stories) సిరీస్‌లో మేఘా ఉపాధ్యాయ్ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచింది. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయి పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్‌లో శృంగారం హద్దులు దాటిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’, ‘షేర్‌షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి హిట్ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ (Kiara Advani)గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
షేర్‌షా సినిమాలో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ కియారా జోడీగా నటించింది. అయితే సినిమాకు ముందు నుంచే వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020లోనే వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ వార్తలపై స్పందించకుండా సస్పెన్స్ మెయింటెన్ చేసిన ఈ జంట.. చివరికీ పెళ్లి బంధంతో ఒక్కటై ఆ వార్తలను నిజం చేసింది.
ప్రస్తుతం కియారా (Kiara Advani).. చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
అటు తారక్ – హృతిక్ రోషన్ కాంబోలో రానున్న వార్-2 సినిమాలోనూ కియారా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తూ కియారా బిజీ బిజీగా గడుపుతోంది.
ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూన్నే సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీ (Kiara Advani) చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..