KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?

    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?

    April 21, 2023

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్‌ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి.

    దర్శకుడు: ఫర్హద్ సమ్జీ

    నటీ నటులు: సల్మాన్‌ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్

    సంగీతం:  రవి బస్రూర్, హిమేశ్‌ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్

    సినిమాటోగ్రఫీ: వి. మణికందన్

    కథ

    భాయ్ జాన్( సల్మాన్ ఖాన్) తన ఊరిలో శక్తివంతమైన నాయకుడు. అమ్మాయిలంటే పడుదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాలనుకుంటాడు. తన ముగ్గురు సోదరులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే  అతని ముగ్గురు తమ్ముళ్లు తన  అన్నయ్యకు పెళ్లి చేసి వాళ్ల ప్రేమకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మిని ( పూజా హెగ్డే) ప్రేమించేలా చేస్తారు. ఆమె ప్రేమలో పడిన భాయ్ జాన్, భాగ్యలక్ష్మికి ప్రాణ హాని ఉందని తెలిసి ఆమెను ఎలా కాపాడతాడు. అసలు  భాగ్యలక్ష్మికి  విలన్‌ నుంచి ఉన్న ఆపద ఏంటి? భాగ్యలక్ష్మిని భాయి జాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మిగతా కథ. 

    ఎలా ఉందంటే

    ఈ సినిమాను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు రెండు సార్లు చూశారు. అజిత్ హీరోగా నటించిన వీరమ్‌ చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయినా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ అదే కథను కాటమ రాయుడుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దీన్ని కిసీకా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్‌ తీశాడు. 

    చిత్రంలో స్వల్పంగా మార్పులు మాత్రమే చేశారు. అచ్చుగుద్దినట్లు కాటమరాయుడు చూస్తున్నట్లే అనిపిస్తుంది.సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో కామెడీతో మెప్పించాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ మధ్యలో మాస్ ఫైట్లు అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది. 

    సెకాండాఫ్ సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వెంకటేశ్‌, సల్మాన్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక సల్లు భాయ్‌ లుంగీలో చేసిన డాన్స్‌ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. క్లైమాక్స్‌ అంతా రొటీన్‌గానే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి. 

    ఎవరెలా చేశారు

    సినిమా మెుత్తం సల్మాన్ ఖాన్ వన్‌ మేన్‌ షో. చిత్రం మెుదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సల్లు భాయ్‌దే హవా. కామెడీ, ఫైట్లతో అలరించాడు. మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. పూజా హెగ్డే నటనతో మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విక్టరీ వెంకటేశ్, షెహనాజ్ గిల్‌ సహా మిగతా వారందరూ తమ పరిధి మేరకు నటించారు. పాటలో రామ్ చరణ్‌ డాన్స్‌ బాగుంది. 

    సాంకేతిక పనితీరు

    సినిమాటోగ్రఫీ బాగుంది. కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ చిత్రానికి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ ప్లేపై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. అచ్చుగుద్దినట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    బలాలు

    సల్మాన్ ఖాన్

    పూజా హెగ్డే

    కామెడీ

    బలహీనతలు

    తెలిసిన కథ

    రేటింగ్ : 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version