Kitchen Maintenance Tips: మీ వంట గదిలో పరిశుభ్రత లోపించిందా..? అయితే చిక్కుల్లో పడ్డట్టే. వెంటనే ఈ టిప్స్‌ పాటించండి..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kitchen Maintenance Tips: మీ వంట గదిలో పరిశుభ్రత లోపించిందా..? అయితే చిక్కుల్లో పడ్డట్టే. వెంటనే ఈ టిప్స్‌ పాటించండి..!

    Kitchen Maintenance Tips: మీ వంట గదిలో పరిశుభ్రత లోపించిందా..? అయితే చిక్కుల్లో పడ్డట్టే. వెంటనే ఈ టిప్స్‌ పాటించండి..!

    August 30, 2023

    ప్రతి ఇంట్లో వంట గది ఎంతో కీలకమైనది. ఎందుకంటే మనం తినే ఆహారం అక్కడ నుంచే తయారవుతుంది. కాబట్టి కిచెన్‌ను అందంగా ఉంచడంతో పాటు పరిశుభ్రతను మెయిన్‌టెన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే ఎన్నో రోగాలకు వంటిగది కేంద్ర బిందువుగా మారే పరిస్థితి ఉంటుంది. శుభ్రత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన బొద్దింకలు, బల్లులు, ఈగలు, కంటికి కనిపించని క్రిమి కీటకాలు కిచెన్‌ను ఆక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటిని ఎలా నీట్‌గా ఉంచుతామే వంట గదిని, దానిలోని సామగ్రిని అంతే శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. మరి వంటగది శుభ్రత కోసం ఎలాంటి చిట్కాలు అనుసరిస్తే సత్ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 

    డస్ట్‌బిన్ కవర్స్‌ తప్పనిసరి

    కూరగాయలు కట్‌ చేయడం, ఆకుకూరలను శుభ్రం చేయడం ఇతరత్రా కారణాలతో కిచెన్‌లో వ్యర్థాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించుకోవాలి. అక్కడ డస్ట్‌బిన్‌ కవర్‌ను ఏర్పాటు చేసి వ్యర్థాలు వేసిన వెంటనే దాన్ని ఓపెన్‌గా ఉంచకుండా క్లోజ్‌ చేయాలి. అప్పుడు ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర కీటకాలు వాటిలో చేరే అవకాశం ఉండదు. 

    ఫుడ్‌ మరకలపై నిర్లక్ష్యం వద్దు

    గ్యాస్‌ స్టవ్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఆహారం వండే క్రమంలో చిందులు పడుతుంటాయి. వంట పూర్తైన వెంటనే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. లేదంటే హానికారక క్రిములు ఆ ప్రాంతాన్ని సంతానోత్పత్తికి కేంద్రంగా చేసుకునే ప్రమాదం ఉంది. శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించడం బెటర్.

    సింక్ శుభ్రత ముఖ్యం

    వంటగదిలో సింక్‌  కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడే గృహిణులు గిన్నెలు కడుగుతారు. నూనె, కొవ్వు పదార్థాలు, మాంసాన్ని శుభ్రం చేస్తుంటారు. ఫలితంగా సింక్‌లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ఇన్ఫెక్షన్స్‌ వ్యాప్తికి దారితీస్తుంది. కాబట్టి మీ కిచెన్ సింక్ శుభ్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం. డిటర్జెంట్ పౌడర్‌తో తరచూ సింక్‌ను శుభ్రం చేయడం మంచిది.

    సింక్ పైపు పైనా ఓ కన్నేయండి..!

    వంటగది సింక్‌కు అమర్చిన డ్రెయినేజీ పైపు శుభ్రతపై అప్రమత్తంగా ఉండాలి. పైపును నెలకు రెండు సార్లు క్లీన్‌ చేస్తే మీ వంటగదిలోని అనవసర వ్యర్థాలు ఒకే చోట పేరుకుపోకుండా ఉంటాయి. ఆ పైపుల గుండా బొద్దింకలు, పురుగులు కిచెన్‌లోకి వచ్చే ఛాన్స్‌ తగ్గిపోతుంది. 

    టైల్స్‌ అలా వదిలేయకండి..!

    వంటగదిలోని టైల్స్‌పై కొందరు చపాతీలు, కూరగాయలు కట్ చేయడం చేస్తుంటారు. ఆ తర్వాత ఆ మరకలను పట్టించుకోకుండా కేవలం చిపురుతో చిమ్మెసి సరిపెట్టుకుంటారు. అలా చేయకూడదు. కనీసం మూడు రోజులకు ఒకసారి వంట గది టైల్స్‌ను శుభ్రం చేయాలి. సమయం ఉంటే, ప్రతి రాత్రి పడుకునే ముందు క్లీన్‌ చేసుకోవడం ఉత్తమం.

    ఆహార నిల్వపై అవగాహన

    ఎక్కువ కాలం నిల్వ చేసే ఆహార పదార్థాల చుట్టూ పురుగుల మందు పిచికారీ చేయండి. ఇది ఆహారాన్ని భద్రపరచడమే కాకుండా ఆహారం చుట్టూ సూక్ష్మక్రిములు సంచరించే అవకాశాన్ని నివారిస్తాయి. దీంతో ఆహారం పాడవకుండా ఉంటుంది. అలాగే ఆహార నిల్వ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా మార్చడం అసలు మర్చిపోవద్దు. 

    ఫ్రిజ్, మైక్రోవేవ్ శుభ్రత

    వైరస్‌లు, బ్యాక్టీరియాలు మీ ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ లోపలి భాగంలో కూడా పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ వాటికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్‌ను శుభ్రం చేయండి. ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version