IPL 2021- KKR vs MI Match Highlights
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2021- KKR vs MI Match Highlights

    IPL 2021- KKR vs MI Match Highlights

    November 16, 2021
    in IPL

    Ⓒ ANI PHOTO

    Ⓒ ANI PHOTO

    అబుదాబిలో జరిగిన 34వ ఐపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు.

    Ⓒ ANI PHOTO

    MI కెప్టెన్ రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు(4 ఫోర్లు) చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో 78 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ముంబై 9.2 ఓవర్‌లో మొదటి వికెట్ కోల్పోయింది.

    Ⓒ ANI PHOTO

    బౌండరీ లైన్ వద్ద రోహిత్ శర్మ క్యాచ్‌ను శుభమన్ గిల్ అందుకున్నాడిలా..! రోహిత్ అవుట్‌తో ముంబై దూకుడుకి కళ్లెం పడింది.

    Ⓒ ANI PHOTO

    వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 89 పరుగుల వద్ద హిట్‌మ్యాన్ జట్టు 2వ వికెట్ కోల్పోయింది.

    Ⓒ ANI PHOTO

    సునీల్ నరైన్ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ పడగొట్టాడు. అలాగే డికాక్ క్యాచ్ పట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    Ⓒ ANI PHOTO

    లాకీ ఫెర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో ముంబై 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

    Ⓒ ANI PHOTO

    156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో 53(4 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేశాడు. శుభ్‌మన్ 13 పరుగులకే ఔటయ్యాడు.

    Ⓒ ANI PHOTO

    రాహుల్ త్రిపాఠి దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 42 బంతుల్లోనే  74(8 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    Ⓒ ANI PHOTO

    అయ్యర్, త్రిపాఠి చక్కని భాగస్వామ్యం నెలకొల్పి కోల్‌కత్తా విజయానికి బాటలు పరిచారు. దీంతో ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని కోల్‌కత్తా 15.1 ఓవర్లలోనే ఛేదించింది. విజయం సాధించింది.

    Ⓒ ANI PHOTO

    ముంబై తరఫున బుమ్రా ఒక్కటే 3 వికెట్లు తీశాడు. ఇతడు 4 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చాడు. స్కోర్ ఇచ్చినా వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

    Ⓒ ANI PHOTO

    ఐపీఎల్ సీజన్ 14 పున:ప్రారంభం తర్వాత ముంబై వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో నిరాశకు గురైంది. పాయింట్ల పట్టికలో రోహిత్ సేన 8 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version