నేడు( సెప్టెబంర్ 23) ప్రపంచ వ్యాప్తంగా కృష్ణవ్రింద విహారి మూవీ థియేటర్లలో విడుదలైంది. లక్ష్యతో ఫ్లాప్ అందుకున్న నాగశౌర్య హిట్ కొట్టాడా? కొత్త హీరోయిన్ షెర్లీ నటన ఎలా ఉంది? డైరెక్టర్ అనీష్ కృష్ణ తన కథనంతో ప్రేక్షకులను మెప్పించాడో లేదో ఓసారి సమీక్షిద్దాం.
సమీక్ష:
కృష్ణవ్రింద విహారి మూవీ దాదాపు హీరో నాని నటించిన అంటే సుందరానికీ సినిమా మాదిరిగానే ఉంది. కానీ సినిమా కథనాన్ని నిర్వహించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కామెడీతో సినిమా నడిస్తే.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సన్నివేశాలతో కొనసాగింది. సత్య తన పాత్ర పరిధిమేరకు నటించారు. వెన్నెల కిశోర్ రోల్ కొద్దిగానే ఉన్నప్పటికీ బాగా నవ్వించారు. ఇక హీరో నాగ శౌర్య తన పాత్రలో ఒదిగి పోయాడు. కొత్త హీరోయిన్ షెర్లీ సెటియా క్యూట్ లుక్స్‌లో కనిపించినప్పటికీ ఆమె నటన అంత ఆకట్టుకోదు. సినిమాలో ‘యూ ఆర్ మై డ్రీమ్ గర్ల్’, ‘ఎముందిరా’ రెండు పాటలు బాగున్నాయి.డైరెక్టర్ అనీష్ కృష్ణ మంచి స్టోరీ ఎంచుకున్నప్పటికీ దానిని అంతే స్థాయిలో చూపించడంలో విఫలమయ్యారు. సినిమాలో ఫస్టాఫ్, సెకంఢాఫ్‌లోని కామెడీ, కుటుంబ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కు నచ్చుతాయి. మహతి స్వర సాగర్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. టెక్నికల్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా సినిమా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్: 2.5/5
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది